WI VS Ban: వన్డే చరిత్రలో సంచలనం
ABN , Publish Date - Oct 22 , 2025 | 02:48 PM
బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ జట్టు తమ ఇన్నింగ్స్ లోని 50 ఓవర్ల మొత్తాన్ని స్పిన్ బౌలర్ల చేత వేయించి వరల్డ్ రికార్డు నమోదు చేసింది. క్రికెట్లో పూర్తి స్థాయి సభ్యదేశం ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించడం ఇదే మొదటిసారి.
క్రికెట్ న్యూస్: ఒకప్పుడు వెస్టిండీస్(West Indies) క్రికెట్ ప్రపంచంలో రారాజులాగా వెలిగింది. ఆ జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. కారణం..విండీస్ ఫాస్ట్ బౌలింగ్ ఆ రేంజ్ లో ఉండేది. ఆ తర్వాత అనూహ్యంగా చిన్న జట్ల స్థాయికి ఈ కరేబియన్ జట్టు పడింది. పలు సందర్భాల్లో చిన్న జట్ల చేతుల్లో కూడా ఓటమి చవిచూసింది. ఇటీవల కాలంలో ఏ రికార్డును తన ఖాతాలో వేసుకోని విండీస్ తాజాగా ఓ సంచలన రికార్డును నమోదు చేసింది. దీంతో ప్రస్తుతం ఈ కరేబియన్ జట్టు పేరు మారుమోగుతుంది. వివరాల్లోకి వెళ్తే..
అక్టోబర్ 21(మంగళవారం)న బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్(West Indies) జట్టు తమ ఇన్నింగ్స్ లోని 50 ఓవర్ల మొత్తాన్ని స్పిన్ బౌలర్ల చేత వేయించి వరల్డ్ రికార్డు( World Record Spin Bowling) నమోదు చేసింది. క్రికెట్లో పూర్తి స్థాయి సభ్యదేశం ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించడం ఇదే మొదటిసారి. తొలి వన్డేలో బంగ్లా స్పిన్ కు దెబ్బతిన్న విండీస్.. రెండో వన్డేలో స్పిన్నర్లతో దాడికి దిగాలను భావించింది. ఇది కరేబియన్ క్రికెట్ సంప్రదాయానికి పూర్తి విరుద్ధమైన నిర్ణయమైనా.. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్టుగా తీసుకున్న సరైన నిర్ణయంగా ఆ జట్టు నిరూపించింది. వెస్టిండీస్ జట్టు ఐదుగురు స్పిన్ బౌలర్లను (అకీల్ హోసేన్, రోస్టన్ ఛేజ్, ఖారీ పియెర్రీ, గుడకేశ్ మోటీ, అలిక్ అథనాజ్) ఉపయోగించింది. వీరి ధాటికి బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లకు 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన విండీస్(West Indies) కూడా నిర్ణీత 50 ఓవర్లకు 213 స్కోర్ చేసింది. దీంతో సూపర్ ఓవరతో కరేబియన్ జట్టు విజేతగా నిలిచింది.
ఈ మ్యాచ్ లో రెండు రికార్డులు బ్రేక్ అయ్యాయి. వన్డే చరిత్రలో 50 ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్ వేసిన తొలి జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. అంతకుముందు శ్రీలంక 1996లో ఇదే కరేబియన్(West Indies) జట్టుపై మూడు సార్లు 44 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేసింది.అలానే ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 50 ఓవర్లు, బంగ్లాదేశ్ 42 ఓవర్లు (ముస్తాఫిజుర్ రెహమాన్ ఒక్కడే పేసర్) స్పిన్ బౌలింగ్ వేయడంతో, ఇరు జట్లు కలిపి మొత్తం 92 ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేయడంతో అరుదైన వరల్డ్ రికార్డు(World Record Spin Bowling) నమోదైంది. అంతకుముందు 78.2 ఓవర్ల రికార్డు ఉండేది.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి