Womens World Cup: టాప్ లేపిన సఫారీలు
ABN , Publish Date - Oct 22 , 2025 | 02:57 AM
కెప్టెన్ లారా వొల్వార్ట్ (90) దూకుడైన ఇన్నింగ్స్‌కు మరిజానె కాప్ (68 నాటౌట్, 3/20) ఆల్‌రౌండ్ షో తోడుకావడంతో.. మహిళల వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసిన దక్షిణాఫ్రికా 10 పాయింట్లతో...
నేటి మ్యాచ్
ఆస్ట్రేలియా X ఇంగ్లండ్
మ.3 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో
మహిళల వన్డే వరల్డ్‌కప్
అదరగొట్టిన వొల్వార్ట్, కాప్
150 పరుగులతో పాక్ చిత్తు
కొలంబో: కెప్టెన్ లారా వొల్వార్ట్ (90) దూకుడైన ఇన్నింగ్స్‌కు మరిజానె కాప్ (68 నాటౌట్, 3/20) ఆల్‌రౌండ్ షో తోడుకావడంతో.. మహిళల వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసిన దక్షిణాఫ్రికా 10 పాయింట్లతో టాప్‌నకు చేరుకొంది. మంగళవారం జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 150 పరుగుల (డ/లూ పద్ధతి) తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో పాక్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత సౌతాఫ్రికా 9 వికెట్లకు 312 పరుగులు చేసింది. మెగా టోర్నీ చరిత్రలో సఫారీలకు ఇదే అత్యధిక స్కోరు. సునె లుస్ (61), డి క్లెర్క్ (41) అదరగొట్టారు. నష్రా సంధు, సాదియా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం తొలుత పాక్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 306 పరుగులుగా నిర్ణయించారు. అయితే, పలుమార్లు వర్షం ఆటంకం కలిగించడంతో టార్గెట్‌ను 20 ఓవర్లలో 234 పరుగులకు కుదించారు. కానీ, ఓవర్లన్నీ ఆడిన పాక్ 83/7 స్కోరు మాత్రమే చేసింది.
బ్రిట్స్ విఫలం: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తన్జిమ్ బ్రిట్స్ (0) డకౌట్ అయింది. మరో ఓపెనర్ లారా, లుస్ రెండో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. ఆఖర్లో కాప్‌తోపాటు డి క్లెర్క్ మెరుపులు మెరిపించడంతో సౌతాఫ్రికా సులువుగా 300 మార్క్ దాటింది.
సంక్షిప్త స్కోర్లు: సౌతాఫ్రికా: 40 ఓవర్లలో 312/9 (లారా 90, కాప్ 68 నాటౌట్, లుస్ 61; నష్రా 3/45, సైదా 3/63); పాకిస్థాన్: 20 ఓవర్లలో 83/7 (సిద్రా 22 నాటౌట్, నటాలియా 20; కాప్ 3/20, షంగసె 2/19).
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా ర.రే
దక్షిణాఫ్రికా 6 5 1 0 10 0.276
ఆస్ట్రేలియా 5 4 0 1 9 1.818
ఇంగ్లండ్ 5 4 0 1 9 1.490
భారత్ 5 2 3 0 4 0.526
న్యూజిలాండ్ 5 1 2 2 4 -0.245
శ్రీలంక 6 1 3 2 4 -1.035
బంగ్లాదేశ్ 6 2 5 0 2 -0.578
పాకిస్థాన్ 6 0 4 2 2 -2.651
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
పా: పాయింట్లు; ఫ.తే: ఫలితం తేలనవి; ర.రే: రన్‌రేట్
సోమవారం ముంబైలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 7 పరుగులతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. తొలుత లంక 48.4 ఓవర్లలో 202 రన్స్‌కు ఆలౌటైంది. ఛేదనలో బంగ్లా ఓవర్లన్నీ ఆడి 195/9 స్కోరే చేసింది.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి