Share News

Haris Rauf: రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం

ABN , Publish Date - Nov 05 , 2025 | 10:51 AM

ఆసియా కప్‌లో ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు హారిస్ రవూఫ్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. సూర్య కుమార్ యాదవ్, బుమ్రా, ఫర్హాన్‌లపై కూడా జరిమానాలు విధించారు.

Haris Rauf: రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం
Haris Rauf

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన ఆటగాళ్లపై ఐసీసీ చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ స్టార్ పేసర్ హారిస్ రవూఫ్, టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు ఐసీసీ తేల్చి చెప్పింది. దీంతో పాక్ ప్లేయర్ రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది.


ఆసియా కప్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో హారిస్ రవూఫ్‌ ఆరు ఫైటర్ జెట్‌లు కూల్చివేసినట్లు చేతితో సంజ్ఞ చేశాడు. దీంతో అతడికి 30 శాతం చొప్పున రెండు మ్యాచ్ ఫీజుల్లో కోత పెట్టింది. రెండేసి చొప్పున నాలుగు డీమెరిట్ పాయింట్లు కూడా రవూఫ్ ఖాతాలో చేరాయి. ఓ ఆటగాడు 24 నెలల వ్యవధిలో నాలుగు పాయింట్లు పొందితే రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురవుతాడు. దీంతో సౌతాఫ్రికాతో తొలి రెండు వన్డేలకు రవూఫ్ దూరమయ్యాడు.


సూర్యపై కూడా..

టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌(Suryakumar Yadav)కు కూడా రెండు డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు. సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ ప్రజెంటెషన్ సందర్భంగా ఆ విజయాన్ని పహల్గాం బాధితుల కుటుంబాలకు, భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. ఇది ఆట నియమాలకు విరుద్ధం. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 30శాతం జరిమానా విధించారు. ఆసియా కప్ ఫైనల్లో రవూఫ్‌ను బౌల్డ్ చేయగానే.. విమానం దూసుకొస్తున్నట్లు సంజ్ఞ చేసినందుకు బుమ్రా(Bumrah)పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. భారత్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ అనంతరం ‘గన్ ఫైర్’ సంబరాలు చేసుకున్నందుకు పాకిస్తాన్ ప్లేయర్ ఫర్హాన్‌పై కూడా జరిమానా విధించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 10:51 AM