Share News

Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:34 PM

టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ శనివారం (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అద్భుత సెంచరీ(121*) చేశాడు. ఇక రోహిత్ శర్మ సెంచరీపై కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంది.

Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్
Rohit Sharma

క్రికెట్ న్యూస్: టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) శనివారం (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అద్భుత సెంచరీ(121*) చేశాడు. దీంతో 2027 ప్రపంచ కప్ వరకు కొనసాగడానికి తనలో ఇంకా చాలా సత్తా ఉందని ఈ స్టార్ ప్లేయర్ నిరూపించాడు. ఆసీస్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ(Virat Kohil)(74*) కూడా ఫామ్ లోకి వచ్చాడు.


మూడో వన్డేలో రోహిత్(Rohit century celebration) 33వ ఓవర్ చివరి బంతికి ఆడమ్ జంపా బౌలింగ్‌లో సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే.. రోహిత్ సెంచరీ చేసిన సమయంలో మరో ఎండ్ లో అతని చిరకాల భాగస్వామి విరాట్ కోహ్లీ(Virat Kohli) ఉన్నాడు. 237 పరుగుల ఛేదనలో ఈ ఇద్దరు దిగ్గజాలు తమ పాత రోజులను గుర్తు చేస్తూ, అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ను గెలిపించారు. రోహిత్ శర్మ సెంచరీ చేసిన వెంటనే గ్రౌండ్ మారుమోగింది. ప్రేక్షకులంతా రోహిత్ కు విషెష్ చెప్పారు.


ఇదే సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన(Gautam Gambhir reaction) రియాక్షన్ వైరల్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోహిత్ సెంచరీకి గౌతమ్ గంభీర్ నిలబడి చప్పట్లతో అభినందించాడు. తన నమ్మకాన్ని రోహిత్ , కోహ్లీ నిలబెట్టారని గట్టిగా చప్పట్లు కొడుతూ పరోక్షంగా సంతోషం వ్యక్తం చేశాడు. తాజాగా ఇన్నింగ్స్ తో 2027 ప్రపంచకప్ లో(2027 World Cup) రోహిత్ ఆడటం ఖాయమని అతని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సిడ్నీలో చేసిన సెంచరీ రోహిత్ శర్మ 50వది.


Also Read:

KTR VS Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి: కేటీఆర్

IND VS AUS: రోహిత్‌ శర్మ సెంచరీ..మూడో వన్డేలో భారత్ ఘన విజయం

Updated Date - Oct 25 , 2025 | 05:52 PM