Share News

Rohit Sharma: ఫీల్డింగ్‌లోనూ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అదెలాగంటే?

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:13 PM

మూడో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్‌లు అందుకుని వన్డే క్రికెట్‌లో 100 క్యాచ్‌లు పట్టిన ఆరో భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని చేరుకోవడంలో రోహిత్ శర్మ భారత దిగ్గజం సౌరవ్ గంగూలీని కూడా అధిగమించాడు.

Rohit Sharma: ఫీల్డింగ్‌లోనూ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అదెలాగంటే?
Rohit Sharma

సిడ్నీ(Sydney) వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే(ODI)లో రోహిత్ శర్మ శతక్కొట్టాడు. ఏకంగా 125 బంతులను ఎదుర్కొని 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో పాటు ఫీల్డింగ్‌లోనూ హిట్‌మ్యాన్ సెంచరీ సాధించాడు. అదెలగంటారా.. శనివారం జరిగిన మూడో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్‌లు అందుకుని వన్డే క్రికెట్‌లో 100 క్యాచ్‌లు పట్టిన ఆరో భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని చేరుకోవడంలో రోహిత్ శర్మ భారత దిగ్గజం సౌరవ్ గంగూలీని కూడా అధిగమించాడు.


మూడో వన్డేలో హర్షిత్ రాణా బౌలింగ్‌లో మిచెల్ ఓవెన్ క్యాచ్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో నాథన్ ఎల్లిస్ క్యాచ్‌లను రోహిత్ శర్మ పట్టుకున్నాడు. రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఆడుతున్న 276వ వన్డే మ్యాచ్‌లో ఈ 100 క్యాచ్‌ల ఫీట్‌ను అందుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(164 క్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ(Virat Kohli) తర్వాత మహ్మద్ అజారుద్దీన్(156), సచిన్ టెండూల్కర్(140), రాహుల్ ద్రవిడ్(124), సురేశ్ రైనా(102) ఉన్నారు. ప్రస్తుతం ఈ క్లబ్‌లో రోహిత్ శర్మ చేరాడు.


వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ ఇద్దరి పేరిట ఇప్పుడు 100 క్యాచ్‌లు ఉన్నాయి. అయితే, రోహిత్ శర్మ ఈ ఘనతను గంగూలీ కంటే వేగంగా సాధించాడు. సౌరవ్ గంగూలీ 100 క్యాచ్‌లు పూర్తి చేయడానికి 311 వన్డే మ్యాచ్‌లు ఆడగా, రోహిత్ శర్మ కేవలం 276 మ్యాచ్‌లలోనే ఈ ఫీట్‌ను చేరుకున్నాడు.


Also Read:

KTR VS Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి: కేటీఆర్

IND VS AUS: రోహిత్‌ శర్మ సెంచరీ..మూడో వన్డేలో భారత్ ఘన విజయం

Updated Date - Oct 25 , 2025 | 05:45 PM