Share News

Team India: దుబాయ్ నుంచి సైలెంట్‌గా ఇళ్లకు.. నో సెలబ్రేషన్స్.. రీజన్ ఇదే

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:06 PM

BCCI: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్‌ తర్వాత నేరుగా స్వదేశానికి చేరుకున్నారు భారత ఆటగాళ్లు. అందులో చాలా మంది తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మరి.. బీసీసీఐ హోం సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చేయకపోవడం వెనుక రీజన్ ఏంటి అనేది చూద్దాం..

Team India: దుబాయ్ నుంచి సైలెంట్‌గా ఇళ్లకు.. నో సెలబ్రేషన్స్.. రీజన్ ఇదే
BCCI

చాంపియన్స్ ట్రోఫీ-2025 సంబురాలు ముగియడంతో దుబాయ్‌ను వీడారు భారత ఆటగాళ్లు. అక్కడి నుంచి స్వదేశానికి పయనమై.. నేరుగా ఇళ్లకు వెళ్లిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తదితరులు ఎయిర్‌పోర్ట్‌లో హల్‌చల్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది అభిమానులు హర్ట్ చేస్తోంది. కప్పు గెలవడం డబుల్ హ్యాపీనెస్ పంచినా.. స్వదేశంలో బస్ పరేట్, ఇతర సెలబ్రేషన్స్ ఏవీ లేకుండా సైలెంట్‌గా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోవడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు.


తప్పు ఎవరిది..

గతేడాది భారత జట్టు టీ20 ప్రపంచ కప్-2024ను ఒడిసిపట్టింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి జగజ్జేతగా అవతరించింది. దీంతో స్వదేశంలో టీమిండియాకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ట్రోఫీతో తొలుత ప్రధాని మోడీని కలసిన రోహిత్ అండ్ కో ఆ తర్వాత ముంబైలో నిర్వహించిన బస్ పరేడ్‌లో పాల్గొని అభిమానుల్లో మరింత జోష్ నింపారు. అనంతరం వాంఖడే స్టేడియంలో డ్యాన్సులు చేస్తూ భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఈసారి చాంపియన్స్ ట్రోఫీ సొంతమైనా.. దుబాయ్ నుంచి అందరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో బీసీసీఐదే తప్పు అని.. బోర్డు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఇందులో బోర్డు మిస్టేక్ ఏమీ లేదని తెలుస్తోంది. ఎక్కువ సమయం లేకపోవడం వల్లే సెలబ్రేషన్స్ నిర్వహించొద్దని బీసీసీఐ డిసైడ్ అయిందని సమాచారం.


ప్లేయర్ల బాగు కోసమే..

స్వదేశంలో భారీగా సెలబ్రేషన్స్ నిర్వహించాలని.. అభిమానులతో కప్పు సంబురాలు జరుపుకోవాలని బీసీసీఐ తొలుత భావించిందట. అయితే ఐపీఎల్-2025 మొదలవడానికి అట్టే సమయం లేదు. కొత్త సీజన్‌కు ఇంకో వారం కంటే ఎక్కువ టైమ్ లేదు. ఆల్రెడీ అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ సెషన్స్ స్టార్ట్ చేసేశాయి. దీంతో నిన్న మొన్నటి వరకు వరుస మ్యాచులు, ఒత్తిడితో అలసిపోయిన భారత స్టార్లకు తగినంత రెస్ట్ అవసరమని బోర్డు పెద్దలు అనుకున్నారట. విరామం తర్వాత ఆయా ఫ్రాంచైజీల్లో జాయిన్ అయి.. తిరిగి క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి వాళ్లు ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే సంబురాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారట.


ఇవీ చదవండి:

నా నెక్స్ట్ టార్గెట్ అదే: రోహిత్

చాంపియన్స్ ట్రోఫీ హీరో.. ధీనగాథ తెలిస్తే..

నాపై రూమర్స్‌ వద్దు: జడేజా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2025 | 12:14 PM