Share News

Champions Trophy: క్రిస్ క్రెయిన్స్.. న్యూజిలాండ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన హీరో.. ఇప్పుడు అతడి ధీనగాథ తెలిస్తే..

ABN , Publish Date - Mar 11 , 2025 | 07:59 AM

మన దేశంలో క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడితే చాలు సెలబ్రిటీలు అయిపోతారు. ఓ మోస్తరుగా ఆడినా ఆర్థికంగా సెటిల్ అయిపోతారు. ప్రభుత్వం ఉద్యోగాలు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అయితే అన్ని దేశాల్లోనూ క్రికెటర్లు ఇదే తరహా సెలబ్రిటీ హోదాను అనుభవించలేరు.

Champions Trophy: క్రిస్ క్రెయిన్స్.. న్యూజిలాండ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన హీరో.. ఇప్పుడు అతడి ధీనగాథ తెలిస్తే..
chris cairns

మన దేశంలో క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడితే చాలు సెలబ్రిటీలు అయిపోతారు. ఓ మోస్తరుగా ఆడినా ఆర్థికంగా సెటిల్ అయిపోతారు. ప్రభుత్వం ఉద్యోగాలు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అయితే అన్ని దేశాల్లోనూ క్రికెటర్లు ఇదే తరహా సెలబ్రిటీ హోదాను అనుభవించలేరు. కెరీర్ పూర్తయ్యాక కూడా వారు జీవనోపాధి కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. న్యూజిలాండ్ (New Zealand) జట్టు తరఫున ఆడుతూ చక్కని ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచిన క్రిస్ క్రియిన్స్ (chris cairns) ధీనగాథ తెలిస్తే హృదయం చలించకమానదు.


ఆల్‌రౌండర్‌ ఇయాన్ బోథమ్‌ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన న్యూజిలాండ్ క్రికెటర్‌గా క్రిస్ కెయిన్స్ ఎదిగాడు. తన కెరీర్లో 62 టెస్టులు, 215 వన్డేలు ఆడిన క్రిస్ క్రెయిన్స్ 8273 అంతర్జాతీయ పరుగులు చేశాడు. 420 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. 2000లో భారత్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో క్రిస్ క్రెయిన్స్ అద్భుతం చేశాడు. 102 పరుగులు చేసి న్యూజిలాండ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్ క్రెయిన్స్ జీవితం తల్లకిందులైంది. వజ్రాల వ్యాపారం ప్రారంభించి దారుణంగా నష్టపోయింది. విలాసాలకు అలవాటు పడి సంపద అంతా కోల్పోయాడు.


అనారోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఓ దశలో గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అతని ఆరోగ్యం మరింత దిగజారిపోయింది. చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. చికిత్స కోసం డబ్బులు లేక కష్టాలు ఎదుర్కొన్నాడు. చివరకు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ట్రక్ డ్రైవర్‌గా, వాహనాలను క్లీన్ చేసే క్లీనర్‌గా మారిపోయాడు. జీవితం ఎప్పుడూ ఊహించినట్టు ఉండదని, తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో క్రిస్ క్రెయిన్స్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 11 , 2025 | 07:59 AM