Share News

నాపై రూమర్స్‌ వద్దు: జడేజా

ABN , Publish Date - Mar 11 , 2025 | 02:57 AM

వన్డే ఫార్మాట్‌ నుంచి తప్పుకొంటున్నట్టు వస్తున్న కథనాలపై ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్పందించాడు. ‘అనవసర రూమర్స్‌ వద్దు.. థ్యాంక్స్‌’ అంటూ...

నాపై రూమర్స్‌ వద్దు: జడేజా

దుబాయ్‌: వన్డే ఫార్మాట్‌ నుంచి తప్పుకొంటున్నట్టు వస్తున్న కథనాలపై ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్పందించాడు. ‘అనవసర రూమర్స్‌ వద్దు.. థ్యాంక్స్‌’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో జడ్డూ పోస్ట్‌ చేశాడు. దీంతో ఇప్పట్లో వన్డేలకు గుడ్‌బై చెప్పడం లేదని అతడు స్పష్టం చేసినట్టయ్యింది. న్యూజిలాండ్‌తో ఫైనల్లో జడేజా కోటా ఓవర్లు పూర్తయ్యాక విరాట్‌ పరుగున వెళ్లి అతడిని కౌగిలించుకున్నాడు. దీంతో అతడికిదే చివరి మ్యాచ్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఊహాగానాలు చెలరేగాయి. మరోవైపు ఫైనల్లో కివీస్‌పై ఫోర్‌తో విన్నింగ్‌ షాట్‌ బాదిన జడేజా పుష్ప-2 స్టయిల్లో సంబరాలు చేసుకున్నాడు. తన బ్యాట్‌ను వీపు వెనకాల ఉంచి ‘నేషనల్‌ ఖిలాడీ అనుకున్నావా?’ అనే కామెంట్‌తో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడం వైరల్‌గా మారింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 11 , 2025 | 02:57 AM