Share News

Shubman Gill: గిల్‌కు అంత సీన్ లేదు.. వరల్డ్ కప్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 07 , 2025 | 03:10 PM

టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వరుస వైఫల్యాలతో తీవ్రంగా విమర్శల పాలవుతున్నాడు. గిల్‌కు టీమ్‌లో ఉండే అర్హత లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Shubman Gill: గిల్‌కు అంత సీన్ లేదు.. వరల్డ్ కప్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Shubman Gill

రీసెంట్‌గా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఘోర ఓటమి పాలైంది. ఒకదశలో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. చివరికి వచ్చేసరికి 1-3తో సిరీస్‌ను కోల్పోయింది. ఈ పరిస్థితికి సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఫెయిల్యూర్‌తో పాటు యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ వైఫల్యం కూడా కారణమనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో గిల్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వరుస వైఫల్యాలతో తీవ్రంగా విమర్శల పాలవుతున్నాడు. అతడికి టీమ్‌లో ఉండే అర్హత లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యంగ్ క్రికెటర్ ఆటతీరుపై 1983 వన్డే వరల్డ్ కప్ హీరో కృష్ణమాచారి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యాడు. గిల్‌కు అంత సీన్ లేదని.. అతడు ఓవర్‌రేటెడ్ ప్లేయర్ అని అన్నాడు.


గిల్ బదులు సూర్య!

‘శుబ్‌మన్ గిల్‌కు అంత సీన్ లేదని నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నా. కానీ ఎవరూ నమ్మలేదు. నా మాటలు పట్టించుకోలేదు. గిల్‌కు ఇన్ని చాన్సులు దొరుకుతున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వకపోవడం షాకింగ్‌ అనే చెప్పాలి. సూర్యకు లాంగ్ ఫార్మాట్‌లో సరైన అవకాశాలు లభించలేదు. టెక్నికల్‌గా అతడు బాగా సౌండ్ ప్లేయర్. కానీ అతడిపై మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచలేదు. వైట్‌బాల్ స్పెషలిస్ట్ అంటూ ముద్ర వేసేశారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ వంటి వారిని కూడా పట్టించుకోవడం లేదు. ఇండియా ఏ టూర్స్‌లో మెరుపులు మెరిపిస్తున్న సాయి సుదర్శన్ వంటి టాలెంటెడ్ క్రికెటర్స్‌నూ ప్రోత్సహించడం లేదు. వీళ్లకు బదులుగా గిల్‌కు పదే పదే అవకాశాలు ఇస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు’ అని కృష్ణమాచారి శ్రీకాంత్ సీరియస్ అయ్యాడు.


ఇవీ చదవండి:

రోహిత్ ముందు 2 గోల్స్.. ఇవి సాధించే వరకు నో రిటైర్మెంట్..

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగోదు.. యువరాజ్ మాస్ వార్నింగ్!

సెలెక్షన్‌లో ప్రాంతీయ భేదాలు.. ఇదెక్కడి న్యాయం..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 07 , 2025 | 03:12 PM