Gambhir-Sanju: గంభీర్‌కు సంజూ శాంసన్ సవాల్.. కోచ్ అనీ చూడకుండా..
ABN , Publish Date - Jan 27 , 2025 | 01:12 PM
IND vs ENG: టీమిండియా స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ ఏకంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కే సవాల్ విసురుతున్నాడు. కోచ్ అని కూడా చూడకుండా సై అంటున్నాడు. అసలేం జరుగుతోంది అనేది ఇప్పుడు చూద్దాం..

Team India: టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మంచి జోష్‌లో ఉన్నాడు. ఒకప్పుడు భారత జట్టులో చోటు దొరికితే గొప్ప అనే సిచ్యువేషన్‌లో ఉన్నోడు.. ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ పర్మినెంట్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆల్రెడీ టీ20ల్లో వరుస సెంచరీలతో అతడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో సంజూ బ్యాట్ నుంచి ఇంకా బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ రాలేదు. దాని కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు అతడు సవాల్ విసరడం ఆసక్తికరంగా మారింది. అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
రికార్డుపై గురి!
సంజూ శాంసన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో అతడు ఆ రికార్డును బద్దలు కొట్టాలని చూస్తున్నాడు. ఆటగాళ్లు మైల్‌స్టోన్స్ అందుకోవడం, పాత రికార్డులకు పాతర వేయడం, కొత్తవి క్రియేట్ చేయడం మామూలే కదా అని అనుకోవచ్చు. కానీ సంజూ కన్నేసిన రికార్డు హెడ్ కోచ్ గంభీర్ పేరు మీద ఉండటం విశేషం. ఆ రికార్డు మరేదో కాదు.. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల రికార్డు.
దాటడం పక్కా!
టీ20 క్రికెట్‌లో గంభీర్ 37 మ్యాచుల్లో 932 పరుగులు చేశాడు. అదే సంజూ శాంసన్ ఇప్పటివరకు ఆడిన 39 మ్యాచుల్లో కలిపి 841 పరుగులు చేశాడు. గౌతీ స్కోరుకు అతడు ఇంకో 92 పరుగుల దూరంలో ఉన్నాడు. క్రీజులో నిలదొక్కుకుంటే అవలీలగా ఫిఫ్టీలు, హండ్రెడ్‌లు కొట్టడం శాంసన్‌కు అలవాటు. ఒకవేళ మూడో టీ20లో గనుక అతడు 10 ఓవర్ల వరకు ఆడితే గంభీర్ రికార్డును బ్రేక్ చేయడం ఖాయం. కాగా, భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ (4,231 రన్స్) టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ (4,188), సూర్యకుమార్ యాదవ్ (2,582) ఉన్నారు. సంజూ ఆ స్థాయికి చేరుకోవాలంటే మరికొన్నేళ్ల పాటు నిలకడగా పరుగులు చేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి