హరి, అర్జున్‌కు డ్రా
ABN , Publish Date - Jan 27 , 2025 | 02:53 AM
టాటా స్టీల్ మాస్టర్స్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, అర్జున్ ఇరిగేసి ఎనిమిదో రౌండ్‌ను డ్రాగా ముగించారు. ఆదివారం అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో...
వికాన్ జీ: టాటా స్టీల్ మాస్టర్స్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, అర్జున్ ఇరిగేసి ఎనిమిదో రౌండ్‌ను డ్రాగా ముగించారు. ఆదివారం అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో జరిగిన గేమ్‌ను హరి 30 ఎత్తుల తర్వాత డ్రాకు అంగీకరించాడు. అలెక్సీ సరానా (సెర్బియా)తో గేమ్‌ను అర్జున్ 23 ఎత్తుల అనంతరం డ్రా చేసుకున్నాడు. గుకేష్, ప్రజ్ఞానంద మధ్య జరి గిన గేమ్ కూడా డ్రాగా ముగిసింది. 8 రౌండ్ల తర్వాత గుకేష్, ప్రజ్ఞానంద చెరో 5.5 పాయిం ట్లతో..హరి 4, అర్జున్ 2 పాయింట్లతో ఉన్నారు.
ఇదీ చదవండి:
క్రికెట్‌లో ఇలాంటి సెలబ్రేషన్ ఎప్పుడూ చూసుండరు.. గాల్లో పల్టీలు కొడుతూ