Share News

Rohit Sharma: నీళ్లు తాగినంత ఈజీగా సిక్సులు.. సీక్రెట్ చెప్పేసిన రోహిత్

ABN , Publish Date - Feb 28 , 2025 | 08:38 PM

Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అతడు వరుసగా ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టచ్‌లోకి రావడం అతడికి బిగ్ ప్లస్‌గా మారింది.

Rohit Sharma: నీళ్లు తాగినంత ఈజీగా సిక్సులు.. సీక్రెట్ చెప్పేసిన రోహిత్
Team India

ప్రస్తుత క్రికెట్‌లో సిక్సుల వీరులు అనగానే ముందు గుర్తుకొచ్చే పేరు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే. ఎంతటి తోపు బౌలింగ్ అటాక్ మీదైనా సిక్సులతో విరుచుకుపడుతుంటాడతను. భారీ షాట్లతో మ్యాచ్‌ను చూస్తుండగానే వన్ సైడ్ చేసేస్తాడు. అలాగని అతడిది కండలు తిరిగిన దేహం కాదు, పొడగరి కూడా కాదు. అయినా నీళ్లు తాగినంత ఈజీగా సిక్సులు కొడుతుంటాడు హిట్‌మ్యాన్. బంతి వేగాన్ని అంచనా వేయడం, బాడీ బ్యాలెన్స్ చేయడం, కరెక్ట్ టైమింగ్‌తో అతడు కొట్టే సిక్సులు చూస్తే ఎన్ని గంటలైనా అలా ఉండిపోవాల్సిందే. మిగతా ప్లేయర్లు కూడా సిక్సుల విషయంలో అతడ్ని కాపీ కొట్టాలని ప్రయత్నించినా ఫెయిల్ అయ్యారు. మరి.. హిట్‌మ్యాన్ పవర్ హిట్టింగ్ సీక్రెట్ ఏంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం..


అదే నా సీక్రెట్

సిక్సులు కొట్టడానికి తన దగ్గర ప్రత్యేకమైన టెక్నిక్ అంటూ ఏదీ లేదన్నాడు రోహిత్. నెట్స్‌లో కూడా సిక్సులే కొట్టాలంటూ ప్రత్యేకంగా సాధన కూడా చేయనన్నాడు. అదంతా తన టైమింగ్ మీదే ఆధారపడిందన్నాడు. టైమింగ్‌ను నమ్ముకొనే తాను సిక్సులు బాదుతుంటానని రివీల్ చేశాడు హిట్‌మ్యాన్. ‘నెట్స్‌లో సిక్సులు కొట్టాలనే ఆలోచనతో వెళ్లి ప్రాక్టీస్ చేయను. నా టైమింగ్ మీదే ఆధారపడతా. సిక్సులు కొట్టడంలో టైమింగే కీలకమని నమ్ముతా. బ్యాటింగ్ చేసేటప్పుడు అన్ని విషయాలను సింపుల్‌గా ఉంచేందుకు ప్రయత్నిస్తా. అయితే నా హిట్టింగ్ వెనుక తీవ్ర శ్రమ దాగి ఉంది. నెట్స్‌లో అహర్నిషలు సాధన చేస్తుంటా. గ్రౌండ్‌లో కనిపించే నా బ్యాటింగ్ వెనుక చెప్పలేనంత కష్టం, ప్రాక్టీస్ దాగి ఉన్నాయి’ అని చెప్పుకొచ్చాడు రోహిత్.


ఇవీ చదవండి:

బట్లర్ సంచలన నిర్ణయం

ఈ సిక్స్ చూస్తే కంగారూలకు నిద్రపట్టదు

ఆసీస్‌ను ఊచకోత కోసిన 24 ఏళ్ల బ్యాటర్..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2025 | 08:54 PM