Share News

Rohit Sharma Retirement: రిటైర్ అవ్వాలనుకోలేదు.. రోహిత్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - May 12 , 2025 | 03:05 PM

BCCI: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఐపీఎల్-2025 మధ్యలో హిట్‌మ్యాన్ ఈ అనౌన్స్‌మెంట్ చేశాడు. తాజాగా రిటైర్మెంట్‌పై అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ రోహిత్ ఏమన్నాడంటే..

Rohit Sharma Retirement: రిటైర్ అవ్వాలనుకోలేదు.. రోహిత్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రీసెంట్‌గా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరికొన్నేళ్లు ఆడే సత్తా ఉన్నా హిట్‌మ్యాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్-2025 మధ్యలోనే రిటైర్మెంట్ డెసిషన్ గురించి అనౌన్స్ చేశాడు. ఆల్రెడీ టీ20లకు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్.. ఇక మీదట వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. తాజాగా దీనిపై అతడు స్పందించాడు. రిటైర్ అవ్వాలని తాను అనుకోలేదన్నాడు. తాను ఏదీ ప్లాన్ చేయలేదన్నాడు. ఏదీ ముందుగా నిర్ణయించలేమన్నాడు రోహిత్. టీ20 వరల్డ్ కప్-2024ను సొంతం చేసుకోగానే తాను ఇంకొన్నాళ్లు ఆడాలని అనుకున్నానని, కానీ ఆ తర్వాత ఆలోచిస్తే టీమ్ నుంచి బయటకు వెళ్లడానికి అదే సరైన సమయమని అనిపించిందన్నాడు.


అంత ఈజీ కాదు

బరిలోకి దిగి తాను ఏదైతే చేయాలని ప్లాన్ చేస్తానో.. అది చేయలేని రోజు ఆట నుంచి పూర్తిగా తప్పుకుంటానని రోహిత్ స్పష్టం చేశాడు. ఇప్పుడు మాత్రం క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ఈ గేమే కారణమని చెప్పుకొచ్చాడు. క్రికెట్ తనకు ఎన్నో విషయాలు నేర్పిందన్నాడు హిట్‌మ్యాన్. ఆటలో నుంచి నేర్చుకునే విషయాలు నిజజీవితంలోనూ ఆచరించడానికి అనుగుణంగా ఉంటాయన్నాడు. లైఫ్‌లో ఏదీ అంత ఈజీగా రాదని.. నిబద్ధతత, క్రమశిక్షణతో కష్టపడితే గానీ కావాలనుకున్నదొరదకదన్నాడు రోహిత్. న్యాచులర్ టాలెంట్ లాంటి పదాలు వాడొద్దన్నాడు. నెట్స్‌లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే, అహర్నిషలు ప్రాక్టీస్ చేస్తేనే ప్లేయర్ గేమ్ న్యాచురల్‌గా కనిపిస్తుందని టీమిండియా కెప్టెన్ స్పష్టం చేశాడు. కష్టాన్ని నమ్ముకుంటే ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించాడు రోహిత్.


ఇవీ చదవండి:

ఫేర్‌వెల్ లేకుండానే రిటైర్మెంట్..

కోహ్లీకి దక్కే పెన్షన్ ఎంతంటే..

ఆ రోజు క్రికెట్ వదిలేస్తా: రోహిత్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 12 , 2025 | 03:29 PM