Rishabh Pant: పీకల మీదకు తెచ్చుకుంటున్న పంత్.. ధోనీకి జరిగిన అవమానం రిపీట్
ABN , Publish Date - Jan 20 , 2025 | 07:31 PM
Lucknow Super Giants: ఐపీఎల్-2025కు ముందు లక్నో సూపర్ జియాంట్స్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టుకు కొత్త కెప్టెన్‌గా పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ను నియమిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
లక్నో సూపర్ జియాంట్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా పించ్‌హిట్టర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను తమ జట్టుకు కొత్త సారథిగా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఐపీఎల్-2025లో అతడే కెప్టెన్‌గా ముందుండి టీమ్‌ను నడిపిస్తాడని వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ పంత్ పుట్టుకతోనే లీడర్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ఐపీఎల్‌లో బెస్ట్ కెప్టెన్‌గా అతడు నిలిచిపోతాడని జోస్యం పలికారు. అయితే నెటిజన్స్ మాత్రం గోయెంకా మాటలు నమ్మొద్దని, అనవసరంగా పీకల మీదకు తెచ్చుకోవద్దని, అవమానం తప్పదంటూ పంత్‌ను హెచ్చరిస్తున్నారు.
మాహీ అంతటోడ్ని..!
సంజీవ్ గోయెంకా బిజినెస్ కెరీర్‌ను అటుంచితే.. ఐపీఎల్‌లో మాత్రం ఆయన ఎక్కువగా వివాదాల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం లక్నో సూపర్ జియాంట్స్ యజమానిగా ఉన్న ఆయనకు గతంలో మరో ఐపీఎల్ టీమ్ ఉండేది. అదే రైజింగ్ పుణె సూపర్‌జియాంట్స్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రీప్లేస్‌మెంట్‌గా 2015లో ఈ టీమ్‌ను తీసుకొచ్చారు. మూడు సీజన్ల పాటు నడిచాక ఈ జట్టు కార్యకలాపాలు ఆగిపోయాయి. సీఎస్‌కే తిరిగి లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో పుణెకు ఆడిన ఆటగాళ్లంతా ఆక్షన్‌లోకి వచ్చేశారు. అయితే పుణె యాక్టివ్‌గా ఉన్న సమయంలో ఆ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అవమానం జరిగింది. మాహీని సారథ్య పగ్గాల నుంచి తొలగించారు గోయెంకా.
తొలుత ధోని.. తర్వాత రాహుల్!
కెప్టెన్‌గా వరల్డ్ క్రికెట్‌లో ఎవరూ సాధించనన్ని విజయాలు, ట్రోఫీలు ధోని వశమయ్యాయి. ఐపీఎల్‌లోనూ అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. అయితే రైజింగ్ పూణె టీమ్ సారథిగా అతడు అంతగా ప్రభావం చూపలేకపోవడంతో కెప్టెన్‌గా తీసేశారు గోయెంకా. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత లక్నో సూపర్ జియాంట్స్ టీమ్‌తో ఐపీఎల్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చారు. కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు. అయితే అతడ్ని ఈసారి రిటెన్షన్ చేసుకోలేదు. గత సీజన్‌లో మ్యాచ్‌లో ఓడినందుకు రాహుల్‌ను అందరి ముందే గ్రౌండ్‌లో తిట్టిపోశారు గోయెంకా. పట్టుదలతో బయటకు వచ్చిన రాహుల్.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు షిప్ట్ అయిపోయాడు. అదే టీమ్ నుంచి వచ్చిన పంత్‌ను ఐపీఎల్-2025 కోసం సారథిగా నియమించింది ఎల్‌ఎస్‌జీ. దీంతో అప్పట్లో ధోని, ఈ మధ్య రాహుల్‌కు జరిగిన అవమానం తిరిగి పంత్ విషయంలో రిపీట్ అయ్యేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి:
రోహిత్‌కు అవమానం.. జూనియర్ కెప్టెన్సీలో..
మనసులు గెలుచుకున్న రోహిత్.. నువ్వు గ్రేట్ బాస్
కెప్టెన్‌గా పంత్.. కప్పు కొట్టేలా ఉన్నారే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి