Kohli-Dhoni: ఆ రోజు కోహ్లీకి మెసేజ్ చేశా.. కేవలం అతడి కోసమే: ధోని
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:49 PM
Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఓ రోజు హఠాత్తుగా మెసేజ్ చేశాడట లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని. పెద్దగా ఎవరితోనూ టచ్‌లో ఉండని మాహీ.. విరాట్‌కు ఎందుకు మెసేజ్ చేశాడు? అసలు ఏం జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం..

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని అంతగా ఎవరితో కలవడు. రిటైర్మెంట్ తర్వాత ఇంటికే పరిమితమైన మాహీ.. బయట పెద్దగా దర్శనమివ్వడం లేదు. ఫామ్ హూజ్‌లో వ్యవసాయ పనులతో పాటు అడ్వర్టయిజ్‌మెంట్లు చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. ఏడాదిలో నెలన్నర పాటు ఐపీఎల్‌తో అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్న ధోని.. ఆ తర్వాత మళ్లీ లైమ్ లైట్‌లోకి పెద్దగా రావడం లేదు. అయితే ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే మాత్రం తన కెరీర్‌తో పాటు టీమిండియా ఆటగాళ్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటాడు. తాజాగా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అందుకే మెసేజ్ చేశా..
రిజర్వ్‌డ్‌గా ఉండే ధోని పెద్దగా ఫోన్ కూడా వాడడు. అతడితో కాంటాక్ట్ అవ్వడం చాలా కష్టమైన పని అని తోటి క్రికెటర్లు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి మాహీ.. ఒకసారి కోహ్లీకి మెసేజ్ చేశాడట. విరాట్‌కు ఏ సమస్య వచ్చినా ధోనీతో షేర్ చేసుకుంటాడట. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండటం, చాన్నాళ్ల పాటు కలసి ఆడటంతో ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉన్నా వెంటనే ధోనీని కాంటాక్ట్ అవుతాడట. అందుకే కోహ్లీకి మెసేజ్ చేశానని.. అతడితో మాట్లాడానని మాహీ అన్నాడు.
ఒక్కటే దారి
‘అందరితో టచ్‌లో ఉండాలంటే నా వల్ల కాదు. అయితే మెసేజ్‌లు మాత్రం చేస్తుంటా. ఎవరిదైనా హెల్ప్ కావాలనుకున్నా, నా అవసరం ఇతరులకు ఉన్నా మెసేజ్‌ల ద్వారా కాంటాక్ట్ అవుతా’ అని ధోని చెప్పుకొచ్చాడు. పెద్దగా ఫోన్ వాడరు, మరి.. ఆసియా కప్-2022 సమయంలో కోహ్లీ ఫామ్‌తో తంటాలు పడుతున్న సమయంలో అతడితో ఎలా కమ్యూనికేట్ చేశారు? విరాట్‌తో ఎలా టచ్‌లోకి వచ్చారు? అనే ప్రశ్నకు మాహీ పైవిధంగా సమాధానం ఇచ్చాడు. కాగా, ధోని ప్రస్తుతం ఐపీఎల్ ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ ప్రాక్టీస్ షురూ చేసిన అతడు.. త్వరలో చెన్నైకి చేరుకొని నెట్స్‌లో మరింత చెమటోడ్చనున్నాడు.
ఇవీ చదవండి:
రోహిత్‌కు స్పాట్ పెట్టిన కోహ్లీ
అగ్గి రాజేస్తున్న రోహిత్-కోహ్లీ
52 ఏళ్ల వయసులోనూ సచిన్ రప్పా రప్పా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి