IPL 2025 Playoffs: ప్లేఆఫ్స్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే..
ABN , Publish Date - Apr 30 , 2025 | 03:44 PM
IPL Playoffs Scenario: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతోంది. ప్రతి జట్టు 9 మ్యాచులు ఆడేసింది. కొన్ని టీమ్స్ అయితే 10 మ్యాచులు పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఏ టీమ్ ఎన్ని మ్యాచులు నెగ్గాలో ఇప్పుడు చూద్దాం..
వారం వారం ఐపీఎల్ కొత్త సీజన్ మరింత రసవత్తరంగా మారుతోంది. హాఫ్ సీజన్ వరకు వరుస విజయాలతో అదరగొట్టిన టీమ్స్.. ఇప్పుడు అనూహ్య ఓటములను మూటగట్టుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు పోటీలో లేని టీమ్స్ బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో రేసులోకి దూసుకొస్తున్నాయి. ప్లేఆఫ్స్‌కు కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఇంకొన్ని మ్యాచులతో ప్లేఆఫ్స్ బెర్త్‌లపై కంప్లీట్‌గా క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే అన్ని టీమ్స్ 9 మ్యాచులు ఆడేశాయి. కొన్ని జట్లయితే 10 మ్యాచులు కూడా పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే జట్టు ఇంకా ఎన్ని మ్యాచులు నెగ్గితే నెక్స్ట్ స్టేజ్‌కు క్వాలిఫై అవుతుందో ఇప్పుడు చూద్దాం..
ఇంకో రెండడుగులే..
పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉన్న ఆర్సీబీ (14 పాయింట్లు)కి ఇంకో 4 మ్యాచులు ఉన్నాయి. ఇందులో కనీసం రెండింట్లో గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. అలాగే టాప్ స్పాట్ కైవసం చేసుకోవచ్చు. నెట్ రన్‌రేట్ సూపర్బ్‌గా ఉంది కాబట్టి ఒక్కదాంట్లో నెగ్గినా ఆ టీమ్ ప్లేఆఫ్స్ బెర్త్ పక్కా అనే చెప్పాలి.
మూడు మస్ట్
తలో 12 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరో 3 విజయాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నాలుగింట్లో నెగ్గితే ఏకంగా టాప్-2లో నిలిచే చాన్స్ దొరుకుతుంది. 11 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్ కూడా 3 విక్టరీలు కొడితేనే ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగలదు. కనీసం రెండింట్లో గెలిచినా ఆ టీమ్ పోటీలో ఉంటుంది. లక్నో కూడా 3 విజయాలు నమోదు చేస్తేనే రేసులో ఉంటుంది.
మ్యాజిక్ చేస్తారా..
9 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్న కేకేఆర్.. నెక్స్ట్ ఆడే నాలుగుకు నాలుగు మ్యాచుల్లోనూ తప్పక నెగ్గాలి. అప్పుడు గానీ ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అవ్వదు. కనీసం మూడింట్లో గెలిస్తే పోటీలో ఉంటుంది.
దేవుడే కాపాడాలి..
చెరో 6 పాయింట్లతో టేబుల్‌లో దిగువన ఉన్న రాజస్థాన్, సన్‌రైజర్స్ నెక్స్ట్ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాలి. రాజస్థాన్ కంటే కూడా ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్లేఆఫ్స్ చాన్సులు కాస్త బెటర్‌గా ఉన్నాయి. ఆ టీమ్ ఐదుకు 5 మ్యాచుల్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో నిలబడగలదు. ఇక, 9 మ్యాచుల్లో 4 పాయింట్లతో లాస్ట్‌లో ఉన్న సీఎస్‌కే తదుపరి ఆడే 5 మ్యాచుల్లోనూ గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ దక్కడం కష్టమే.
ఇవీ చదవండి:
ధవన్ దెబ్బకి పాక్ లెజెండ్ షేక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి