Shubman Gill: కపిల్‌దేవ్‌లా గిల్.. ఇది చూసి తీరాల్సిన క్యాచ్
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:13 PM
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. లెజెండ్ కపిల్‌దేవ్‌ను అతడు గుర్తుచేశాడు.

టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎప్పుడూ బ్యాటింగ్‌లోనే అదరగొడుతుంటాడు. అలాంటోడు ఇవాళ ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో గ్రౌండ్‌లో చురుగ్గా కదిలాడు గిల్. ఇదే క్రమంలో ప్రత్యర్థి స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 30వ ఓవర్‌లో యువ పేసర్ హర్షిత్ రాణా వేసిన స్లో బాల్‌ను గట్టిగా కొట్టేందుకు ప్రయత్నించాడు బ్రూక్. సరిగ్గా టైమ్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది.
మెరుపు వేగంతో పరిగెత్తుతూ..
బంతి గాల్లోకి లేవగానే మిడాఫ్‌లో ఉన్న గిల్ పరుగు అందుకున్నాడు. వేగంగా పరిగెత్తుతూ బంతిని సమీపించాడు. బాల్ కింద పడుతుండటంతో అదే వేగంలో డైవ్ చేసి అందుకున్నాడు. కింద పడినా బంతిని మాత్రం అలాగే హోల్డ్ చేశాడు. ఆఖరి క్షణం వరకు బంతి మీద దృష్టి మరల్చలేదు. అలాగే డైవ్ చేసినప్పుడు తన బాడీని బ్యాలెన్స్ చేశాడు. వెనక్కి పరిగెత్తుతూ అతడు పట్టిన ఈ క్యాచ్‌తో ఒక్కసారిగా 1983 వరల్డ్ కప్‌లో దిగ్గజం కపిల్ దేవ్ అందుకున్న బ్యాక్ రన్నింగ్ క్యాచ్‌ను నెటిజన్స్ గుర్తుచేసుకుంటున్నారు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇప్పుడు ఆ జట్టు 38 ఓవర్లలో 3 వికెట్లకు 217 పరుగులతో ఉంది బట్లర్ సేన. జో రూట్ (50 నాటౌట్), జోస్ బట్లర్ (33 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆ టీమ్ జోరు చూస్తుంటే అలవోకగా 300 పరుగుల మార్క్‌ను చేరుకునేలా ఉంది. భారత బౌలర్లు ఏ మేరకు ప్రత్యర్థిని అడ్డుకుంటారో చూడాలి.
ఇవీ చదవండి:
భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్.. రోహిత్-గౌతీ గట్టి ప్లానింగ్
చాంపియన్స్ ట్రోఫీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం.. కమిన్స్, ఫెర్గూసన్ సహా..
టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి