Share News

IND vs ENG: భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్.. రోహిత్-గౌతీ గట్టి ప్లానింగ్

ABN , Publish Date - Feb 09 , 2025 | 02:45 PM

Team India: భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆల్రెడీ టీ20ల్లో తన సామర్థ్యం ఏంటో నిరూపించుకున్న ఆ ఆటగాడు.. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ దుమ్మురేపాలని డిసైడ్ అయ్యాడు.

IND vs ENG: భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్.. రోహిత్-గౌతీ గట్టి ప్లానింగ్
Team India

ఇంగ్లండ్‌-భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో మరో కొత్త ఆటగాడు డెబ్యూ ఇచ్చాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 50 ఓవర్ల ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు టీ20లు ఆడుతూ వచ్చిన ఈ 33 ఏళ్ల మిస్టరీ స్పిన్నర్.. పొట్టి ఫార్మాట్‌లో అదరగొట్టడంతో ఇప్పుడు వన్డేల్లో డెబ్యూ చాన్స్ దక్కించుకున్నాడు. బారాబతి స్టేడియంలో మ్యాచ్ మొదలవడానికి ముందు వరుణ్‌కు టీమిండియా క్యాప్ ఇచ్చి ఆహ్వానించాడు సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.


కోహ్లీ వచ్చేశాడు!

రెండో వన్డేలో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో 2 కీలక మార్పులు చేసింది. తొలి మ్యాచ్‌లో ఆడిన యశస్వి జైస్వాల్ ప్లేస్‌లో విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తి టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం ఆ టీమ్ 13.1 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 89 పరుగులతో ఉంది. బెన్ డకెట్ (57 నాటౌట్), జో రూట్ (2 నాటౌట్) క్రీజులో ఉన్నారు. డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (26)ను అరంగేట్ర ఆటగాడు వరుణ్ వెనక్కి పంపించాడు. మరో 10 రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ ఉండటం, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో ఆ టోర్నీలో ఆడటం అనుమానంగా మారిన నేపథ్యంలో వరుణ్‌ను దుబాయ్ ఫ్లైట్ ఎక్కించాలని రోహిత్-గంభీర్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే ఈ మ్యాచ్‌లో చక్రవర్తిని ఆడించారని తెలుస్తోంది.


ఇవీ చదవండి:

చాంపియన్స్ ట్రోఫీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం.. కమిన్స్, ఫెర్గూసన్ సహా..

టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..

సీఎస్కే స్టార్‌కు గాయం.. మ్యాచ్ మధ్యలోనే రక్తం కక్కుకొని..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 09 , 2025 | 02:52 PM