New Zealands Playing 11: టాస్ ఓడినా భారత్‌కు అదిరిపోయే న్యూస్.. అసలైనోడే ఆడట్లేదు
ABN , Publish Date - Mar 09 , 2025 | 02:36 PM
IND vs NZ Live score: అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ షురూ అయింది. టాస్ నెగ్గిన కివీస్ తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది.
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆఖరాట మొదలైపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. వన్డే క్రికెట్‌లో వరుసగా 15వ సారి టాస్ ఓడిపోయింది టీమిండియా. సారథి రోహిత్ టాస్ కోల్పోవడం ఇది 12వ సారి కావడం గమనార్హం. టాస్ మళ్లీ హ్యాండ్ ఇవ్వడంతో అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. అయితే ఒక విషయం మాత్రం మనకు కలిసొచ్చింది. అదే ప్లేయింగ్ ఎలెవన్. న్యూజిలాండ్ తుదిజట్టులో అనూహ్యంగా ఓ మ్యాన్ విన్నర్‌ను తీసుకోలేదు. అతడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
కీలక మ్యాచ్‌కు దూరం
కివీస్ స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోలేదు. అతడు మొత్తం చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా హెన్రీని ఆడించడం లేదని తెలుస్తోంది. అతడి స్థానంలో మరో స్పీడ్‌స్టర్ నాథన్ స్మిత్‌ను రీప్లేస్ చేస్తున్నట్లు కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తెలిపాడు. గ్రూప్ దశలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హెన్రీ చెలరేగి బౌలింగ్ చేశాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. క్వాలిటీ పేస్‌తో బౌలింగ్ చేస్తూ శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా సహా రవీంద్ర జడేజా, మహ్మద్ షమీని అతడు పెవిలియన్‌కు పంపించాడు. అలాంటి డేంజర్ బౌలర్ లేకపోవడం భారత్‌కు ప్లస్ పాయింటే. ఇది కివీస్‌కు బిగ్ షాక్ అనే చెప్పాలి. మరి.. హెన్రీ స్థానంలో వచ్చిన నాథన్ స్మిత్ ఎంతమేరకు రాణిస్తాడో చూడాలి.
ఇవీ చదవండి:
ప్లేయింగ్ 11తో ట్విస్ట్ ఇచ్చిన రోహిత్
కివీస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బ్యాటర్
నేడు ఫైనల్.. వీళ్ల ఆట మిస్సవ్వొద్దు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి