IND vs AUS: మళ్లీ టాస్ ఓడిన రోహిత్.. టెన్షన్ వద్దు.. మ్యాచ్ మనదే
ABN , Publish Date - Mar 04 , 2025 | 02:15 PM
India vs Australia Toss: రోహిత్ శర్మను మరోసారి అదృష్టం వెక్కిరించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీస్‌లో అతడు టాస్ కోల్పోయాడు. అయితే టాస్ ఓడిపోయినా మ్యాచులు గెలుస్తున్నాం కాబట్టి ఈ సెంటిమెంట్ మనకు మంచిదేనని ఫ్యాన్స్ అంటున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ టాస్ ఓడిపోయాడు. ఇటీవల కాలంలో వరుసగా టాస్ ఓడిపోతున్న హిట్‌మ్యాన్‌కు మళ్లీ అదే రిపీట్ అయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయాడు భారత సారథి. టాస్ గెలిచిన కంగారూ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో టీమిండియా బౌలింగ్‌కు దిగనుంది. ఇది చూసిన నెటిజన్స్.. టాస్ పోయినా ఫర్వాలేదని అంటున్నారు. టాస్ కోల్పోయినా మ్యాచులు గెలుస్తున్నాం కాబట్టి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.