China viral video: ప్రియుడి భార్య ఎంట్రీ.. 10వ అంతస్తు నుంచి యువతి..
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:12 PM
చైనాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందులో ఓ యువతి 10వ అంతస్తు నుంచి వేలాడుతూ ఉండటమే ఈ వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణం. ప్రియుడి భార్య నుంచి తప్పించుకునే క్రమంలో ఓ యువతి 10వ అంతస్తు నుంచి వేలాడింది. చివరకు..
ఇంటర్నెట్ డెస్క్: గత రెండు రోజులుగా చైనా(China viral video)కు సంబంధించిన ఓ చిన్న వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. అంతేకాక అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో పదే పదే షేర్ చేయబడింది. టెన్షన్, ఉద్రిక్తత కలిగించేలా ఉండటంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. చైనా మీడియా నివేదికల ప్రకారం.. గ్వాంగ్‌డాంగ్‌లోని 10వ అంతస్తు అపార్ట్‌మెంట్ వెలుపల ఓ యువతి(woman hanging from building) వేలాడుతూ కనిపించింది. ఆమె ఎలా సేఫ్ అవుతుందా? అని అందరూ టెన్షన్ పడ్డారు. సోషల్ మీడియాలో వచ్చిన లైక్స్, షేర్స్, కామెంట్సే ఈ వీడియో ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో అనడానికి నిదర్శనం.
చైనా(China)కు చెందిన ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఓ మహిళ.. తన లవర్ తో ఉంటుంది. సడెన్ గా అతడి భార్య ఇంటికి రావడంతో ఇద్దరూ ఆందోళనకు గురయ్యారని సమాచారం. వీడియోలో అతను చొక్కా లేకుండా కిటికీలో కనిపిస్తాడు. బాల్కనీలో ఆమెతో కొద్దిసేపు మాట్లాడి, ఆ తర్వాత తిరిగి ఫ్లాట్‌లోకి వెళ్లిపోతాడు. బాల్కనీలో ఒంటరిగా మిగిలిపోయిన ఆ మహిళ(woman hanging from building) ఒక చేత్తో బాల్కనీ రెయిలింగ్‌ను పట్టుకుని, మరో చేతిలో తన ఫోన్‌ను పట్టుకుంటుంది. వీధికి చాలా అంతస్తుల పైన ఆమె వేలాడుతూ ఉండటాన్ని చూసి, కింద ఉన్న ప్రజలు కేకలు వేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది.
10వ అంతస్తు నుంచి ఆమె కింద ఉన్న ఫ్లాట్‌కు నెమ్మదిగా దిగుతుంది. ప్రియుడి ఇంటి(lover House) నుంచి పైపుల ద్వారా క్షణాల్లో తన ఇంట్లోకి వెళ్లింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై భారీగా కామెంట్స్ వస్తున్నాయి. సదరు వ్యక్తిని, మహిళపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పట్టుతప్పి ఉంటే.. ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'భార్య నుంచి తప్పించుకునేందు వేరే మహిళను బలి చేయడం ఏంటని, వీడియో చూసిన తర్వాత అయిన ఆమెకు తెలుస్తుంది కదా' అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
Pakistan MPs: పాకిస్థాన్ ఎంపీల పాడు బుద్ధి.. డబ్బుల కోసం...
3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్