Share News

Five Villages In Polavaram Mandal: ఏబీఎన్ ఎఫెక్ట్.. భారీగా నిధులు విడుదల చేసిన డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Dec 11 , 2025 | 03:26 PM

పోలవరం మండలంలోని పలు గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచరించింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.

Five Villages In Polavaram Mandal: ఏబీఎన్ ఎఫెక్ట్.. భారీగా నిధులు విడుదల చేసిన డిప్యూటీ సీఎం

ఏలూరు, డిసెంబర్ 11: పోలవరం మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన రహదారుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం స్పందించారు. ఈ ఐదు గ్రామాలు.. గవరవరం, గంగన్నగూడెం, తిమ్మన కుంట, కృష్ణంపాలెం ఏడువాడల పాలెం రహదారుల నిర్మాణం కోసం రూ. 7.40 కోట్ల నిధులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంజూరు చేశారు. దీంతో ఈ గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గ్రామస్తులు.. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.


ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం వల్లే తమ గ్రామాలకు రహదారుల నిర్మాణం జరుగనుందంటూ వారు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల ద్వారకా తిరుమల సమీపంలోని ఐ ఎస్ జగన్నాధపురంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి రహదారుల నిర్మాణం అంశాన్ని పవన్ దృష్టికి ఆయా గ్రామస్తులు తీసుకు వెళ్లారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రభాకర్ రావుకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్‌’ రైలు పొడిగింపు

Read Latest AP News and National News

Updated Date - Dec 11 , 2025 | 03:47 PM