CM Revanth Reddy: హైదరాబాద్‌కు మెస్సీ.. రాహుల్, ప్రియాంకకు సీఎం ఆహ్వానం
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:31 PM
ఈనెల 13న ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు చెప్పారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ బయలుదేరే ముందు పార్లమెంటులో సీఎం మీడియాతో ముచ్చటించారు. ఈనెల 13న ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెస్సీ హాజరవుతున్నారని.. ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి తనను కూడా ఒక అతిథిగా పిలిచినట్లు చెప్పారు. తాను కూడా ఒక అతిథిగానే ఆ కార్యక్రమానికి హాజరవనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఒక ప్రముఖ క్రీడాకారుడు హైదరాబాద్‌కు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇస్తున్నామని తెలిపారు. మెస్సీ కార్యక్రమానికి రావాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను కోరానని.. అలాగే ఢిల్లీలో కలిసిన అందరినీ ఆ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా.. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీగా గడిపారు. ఈరోజు ఉదయం పార్లమెంట్‌లో ఏఐసీసీ అధక్షులు మల్లికార్జునఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన అంశాలను వారి దృష్టి తీసుకెళ్లారు. గ్లోబల్ సమ్మిట్‌ను ఏ విధంగా విజయవంతం చేశామనే అంశాలపై చర్చించారు. ఆపై ఢిల్లీ పర్యటనను ముగించుకుని సీఎం హైదరాబాద్‌కు పయనమయ్యారు.
ఇవి కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికకు బ్రేక్.. పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు
ఇద్దరు ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు.. కారణమిదే
Read Latest Telangana News And Telugu News