BREAKING: సర్పంచ్ ఎన్నికకు బ్రేక్.. పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు
ABN , Publish Date - Dec 11 , 2025 | 10:43 AM
కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు సమాచారం ఇవ్వకుండా పెద్ద గోకుల్ తండా వాసులు సర్పంచ్‌ను ఏకగ్రీవం చేసుకున్నారని గ్రామస్తులు నిరసనకు దిగారు.
కామారెడ్డి, డిసెంబర్ 11: తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవగా.. మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగనుంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ నేపథ్యంలో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొనగా కామారెడ్డిలోని ఓ గ్రామంలో మాత్రం ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు బ్రేక్ పడినట్లైంది.
జిల్లాలోని రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు సమాచారం ఇవ్వకుండా పెద్ద గోకుల్ తండా వాసులు సర్పంచ్‌ను ఏకగ్రీవం చేసుకున్నారని గ్రామస్తులు నిరసనకు దిగారు. పెద్ద గోకుల్ తండా వాసిని వేలం పాట ద్వారా ఏకగ్రీవం చేసుకున్నారని చిన్న గోకుల్ తండా వాసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు నిరసనగా చిన్న గోకుల్ తండా వాసులు ఓట్లు వేయకుండా తండాల్లోనే ఉండిపోయారు. తమకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి చిన్న గోకుల్ తండా వాసుల డిమాండ్ పట్ల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి...
ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
నర్సుపై కత్తులతో ఆగంతకుల దాడి.. ఏం జరిగిందంటే
Read Latest Telangana News And Telugu News