Pakistan MPs: పాకిస్థాన్ ఎంపీల పాడు బుద్ధి.. డబ్బుల కోసం...
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:30 PM
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. నగదు విషయంలో జరిగిన ఈ ఘటన.. ఆ దేశ ప్రజాప్రతినిధుల అవినీతి బుద్ధిని బయటపెట్టింది. పాక్ ఎంపీలు చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
పాకిస్థాన్ నేతలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటారు. వాళ్లు చేసే చాలా పనులు, వ్యాఖ్యలు మనకు ఆగ్రహం తెప్పిస్తుంటాయి. అయితే కొన్నిసార్లు వారు చేసే కొన్ని అతిపనులు నవ్వును కూడా తెప్పిస్తాయి. తాజాగా డబ్బుల విషయంలో పాక్ ఎంపీ(Pakistan MPs)లు చేసిన పనికి ఒకవైపు నవ్వుకుంటూనే.. ఇంతలా అవినీతికి దిగజారాలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ(National Assembly) సమావేశంలో జరిగిన ఓ దృశ్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియోలో పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయజ్ సాదిక్.. నేలపై పడిన పది రూ.5 వేల పాకిస్థానీ నోట్ల కట్ట కనిపించింది. వాటి విలువ మన కరెన్సీలో సుమారు రూ. 16,500 ఉంటాయి. ఈ క్రమంలో ఆ నగదుకు సంబంధించిన వ్యక్తిని గుర్తించేందుకు స్పీకర్ ఓ పని చేశాడు. తన చేతితో ఆ డబ్బులు పట్టుకుని.. 'ఈ డబ్బు ఎవరిది? ఇది ఎవరిదైతే వారు దయచేసి చేయి ఎత్తండి' అని అడిగారు. ఏకంగా 12 నుంచి13 మంది ఎంపీలు వెంటనే చేతులు పైకెత్తి, ఆ డబ్బు తమదంటే తమది చెప్పుకున్నారు.
దీంతో స్పీకర్(Speaker Ayaz Sadiq) ఒక్క క్షణం పాటు ఆశ్చర్యపోయారు. ' ఇక్కడ10 నోట్లు ఉన్నాయి..12 మంది ఓనర్లు ఉన్నారు. పరిష్కారం ఎలా అంటూ' అని ఆయన ఫన్నీ కామెంట్స్ చేశారు. చివరికి, ఆ నగదును నిజమైన యజమాని, పీటీఐ ఎంపీకి ముహమ్మద్ ఇక్బాల్ అఫ్రిదికి అప్పగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై ఎంపీలు నవ్వగా, సాధారణ పాకిస్థానీయులు మాత్రం నవ్వలేదు. వైరల్ అయిన వీడియో ఆన్‌లైన్‌లో అపహాస్యం సృష్టించింది. అయితే ఎంపీలు డబ్బును క్లెయిమ్ చేయడానికి తొందరపడటం దేశానికి ఇబ్బందికరంగా, స్థానిక అవినీతి( corruption in Pakistan)ని ప్రతిబింబిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇప్పటికే భారీగా జీతాలు తీసుకుంటున్న ఎంపీలు ఇంత తక్కువ నగదు కోసం పోటీ పడటం దారుమంటూ మరికొందరు విమర్శించారు.
ఇవీ చదవండి:
2030 నాటికి అమెజాన్ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు
3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్