Share News

Must Watch: ఏం ఫీల్ ఉంది మామా.. ఈ గొర్రె తెలివికి సలాం కొట్టాల్సిందే..!

ABN , Publish Date - Dec 21 , 2025 | 09:34 PM

జంతువుల మధ్య జాతి వైరం అనేది సహజం. ఒక జాతికి చెందిన జంతువును మరో జాతి జంతువు దగ్గరకు రానివ్వదు. రెండూ పక్కక పోవడం గానీ.. లేదా రెండూ పోట్లాడటం గానీ చేస్తాయి. అదే సమయంలో సజాతి జంతువుల మధ్య కూడా కొన్నిసార్లు పోరాటం జరుగుతుంటుంది.

Must Watch: ఏం ఫీల్ ఉంది మామా.. ఈ గొర్రె తెలివికి సలాం కొట్టాల్సిందే..!
Two sheeps Fighting

Viral Video: జంతువుల మధ్య జాతి వైరం అనేది సహజం. ఒక జాతికి చెందిన జంతువును మరో జాతి జంతువు దగ్గరకు రానివ్వదు. రెండూ పక్కక పోవడం గానీ.. లేదా రెండూ పోట్లాడటం గానీ చేస్తాయి. అదే సమయంలో సజాతి జంతువుల మధ్య కూడా కొన్నిసార్లు పోరాటం జరుగుతుంటుంది. అటవీ జంతువుల వరకు ఎందుకు గానీ.. మన కళ్ల ముందు, మన ఇళ్లలో పెరిగే జంతువులే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అవును, రెండు కోళ్ల మధ్య యుద్ధం చూసే ఉంటాం. రెండు ఎద్దులు పోట్లాడుకోవడం, రెండు పొట్టేళ్లు ఢీకొట్టడం చూసే ఉంటాం. వీటి మధ్య భీకరమైన యుద్ధం జరుగుద్ది. కోడి పందేలు, పొట్టేళ్ల పందేలు కూడా నిర్వహిస్తుంటారు. ఈ పోటీలకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.


తాజాగా సోషల్ మీడియాలో పొట్టేళ్ల పోట్లాటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా రెండు పొట్టేళ్లు ఎదురెదురు పడితే పోట్లాటకు కాళ్లు దువ్వుతుంటాయి. ఈ వీడియోలోనూ అదే జరిగింది. అయితే, ఓ గెర్రె మాత్రం చాలా తెలివిగా ప్రవర్తించి.. ఆశ్చర్యానికి గురి చేసింది. ఏమాత్రం కష్టపడకుండా.. ప్రత్యర్థి పొట్టేలును కోలుకోలేని దెబ్బతీసింది.


వీడియోలో ఏముందంటే..

వైరల్ అవుతున్న వీడియోలో ఓ గుర్ల ఫామ్‌లో రెండు గొర్రె పొడేళ్లు ఉన్నాయి. వీటిలో ఓ పొట్టేలు.. మరో పొట్టేలును చూసి కాలు దువ్వింది. దీంతో మరో పొట్టేలు కూడా సై అన్నట్లుగా ఫైటింగ్‌కు సిద్ధమయ్యింది. ఈ రెండు పొట్టేళ్ల మధ్య జాలి మాదిరిగా ఐరన్ ఫెన్షింగ్ ఉంది. దీనిని పట్టించుకోకుండా.. రెండు పొట్టేళ్లు దూసుకొచ్చి ఒకదానినొకటి ఢీకొట్టాయి. రెండో దఫా కూడా అవతలి వైపు గొర్రె ఆగ్రహంతో దూసుకొచ్చింది. అయితే, ఇవతలి వైపు గొర్రె మాత్రం చాలా తెలివిగా వ్యవహరించింది. అవతలి గొర్రె వచ్చి ఐరన్ ఫెన్షింగ్‌‌ను ఢీకొడుతుండగా.. ఇవతలి వైపు గొర్రె మాత్రం తాను కూడా ఢీకొంటున్నట్లు ఫర్‌ఫెక్ట్ యాక్టింగ్ చేసింది. దీంతో అవతలి గొర్రె తెలివితక్కువ తనంలో స్వయంకృతంగా గాయాలు చేసుకుంటే.. ఇవతలి గొర్రె మాత్రం జిరో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌తో, స్మార్ట్ తెలివితేటలతో ఈ పోటీలో చిన్న గాయం అవకుండా గెలిచేసింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెగ వైరల్ అవుతోంది. గొర్రె తెలివికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.


Also Read:

ఏపీలో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలి.. మంత్రి సత్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్

తడబడ్డ శ్రీలంక బ్యాటర్లు.. భారత్ టార్గెట్ 122

విల్లుపురంలో బస్సు ప్రమాదం.. వ్లాగర్ కెమెరాలో దృశ్యాలు..

Updated Date - Dec 21 , 2025 | 09:46 PM