Share News

Tsar Bomba: అత్యంత శక్తిమంతమైన అణుబాంబు ఏ దేశం వద్ద ఉందో తెలుసా

ABN , Publish Date - May 11 , 2025 | 06:12 PM

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణుబాంబు రష్యా వద్ద ఉంది. దీన్ని జార్ బాంబా అని అంటారు. ఈ అణుబాంబు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Tsar Bomba: అత్యంత శక్తిమంతమైన అణుబాంబు ఏ దేశం వద్ద ఉందో తెలుసా
Tsar Bomba

భారత్ పాక్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. దీంతో, సరిహద్దు జిల్లాలోని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. మూడు రోజుల డ్రోన్లు, ఆర్టిలరీ షెల్లింగ్ నుంచి కాస్త తెరిపిన పడ్డారు. అయితే, పరిస్థితి ఇప్పటికీ సీరియస్‌గా ఉందని పరిశీలకులు అంటున్నారు. మే 12న ఇరు దేశాల మధ్య జరిగే చర్చలపై అందరి దృష్టీ నెలకొంది. సంప్రదాయిక యుద్ధం మొదలై చివరకు అణు యుద్ధం వరకూ వెళితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు.

భారత్, పాక్ అణు లెక్కల గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. అయితే, అత్యధిక అణ్వాయుధాలున్న దేశాల్లో రష్యా టాప్‌లో ఉంది. రష్యా వద్ద 5449 అణువార్ హెడ్స్ ఉన్నట్టు సమాచారం. ఆ తరువాతి స్థానంలో ఉన్న అమెరికా వద్ద 5277 అణువార్ హెడ్స్ ఉన్నాయి. ప్రపంచంలోని 80 శాతం అణ్వాయుధాలు ఈ రెండు దేశాల వద్దే ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న చైనా వద్ద 600 అణుబాంబులు, భారత్, పాక్ వద్ద వరుసగా 180, 170 వార్ హెడ్స్ ఉన్నాయి.


అణ్వాయుధాల సంఖ్యా పరంగా టాప్‌లో ఉన్న రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణు బాంబు ‘జార్ బాంబా’ కూడా ఉంది. దీన్ని అప్పటి సోవియట్ యూనియన్ 1961లో అభివృద్ధి చేసింది. దీని సామర్థ్యం 58 మెగాటన్నుల టీఎన్‌టీతో సమానం. అంటే.. హిరొషిమా మీద అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే 3800 రెట్లు ఎక్కువ. తొలుత దీన్ని 100 మెగాటన్నుల టీఎన్‌టీ సామర్థ్యంతో సిద్ధం చేయాలనుకున్నారు. అయితే, ఈ తీవ్రతను ఏ దేశం తట్టుకోలేదనే ఉద్దేశంతో ఇందులో సగం సామర్థ్యంలోనే జార్ బాంబాను రూపొందించారట.


తొలి సారీ దీన్ని పరీక్షించిన సందర్భంలో 35 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న భారీ అగ్ని గోళంలా విస్ఫోటనం సంభవించింది. దట్టమైన పొగ 60 కిలోమీటర్ల ఎత్తు వరకూ పుట్టగొడుగు ఆకారంలో విస్తరించిందట. ఓ మహానగరంపై దీన్ని ప్రయోగిస్తే బాంబు పడిన ప్రాంతం నుంచి 35 కిలోమీటర్ల పరిధిలో అంతా భస్మమైపోతుంది. 100 కిలోమీటర్ల పరిధిలోని వారికి థర్డ్ డిగ్రీ కాలిన గాయాలు అవుతాయి. వందల కిలోమీటర్ల దూరంలోని భవనాల కిటికీ అద్దాలు కూడా విస్ఫోటనం తీవ్రతకు పగిలిపోతాయి. అయితే, అణ్వాయుధ అభివృద్ధి, నిల్వలను నిషేధించేందుకు, ఉన్నవాటిని తగ్గించుకునేందుకు ప్రస్తుతం అనేక అంతర్జాతీయ ఒప్పందాలు అమల్లో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా

ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ

భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు

వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

Read Latest and Viral New

Updated Date - May 11 , 2025 | 07:04 PM