Share News

TDE: కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా

ABN , Publish Date - May 09 , 2025 | 09:17 PM

కృష్ణబిలంలో పడి ఓ నక్షత్రం ధ్వంసమవుతున్న చిత్రాన్ని నాసా తాజాగా షేర్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

TDE: కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా
AT2024tvd TDE

ఓ నక్షత్రాన్ని కృష్ణ బిలం (బ్లాక్ హోల్) ధ్వంసం చేస్తున్న ఘటన తాలూకు ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నాసా ఈ చిత్రాన్ని షేర్ చేసింది. సాధారణంగా నక్షత్రమండలం మధ్యలో కృష్ణబిలాలు ఉంటాయి. అయితే, నాసా చిత్రంలోని కృష్ణబిలం నక్షత్రమండలానికి ఓవైపున ఉండటం ఆశ్చర్యకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ బ్లాక్ హోల్‌ను శాస్త్రవేత్తలు ఏటీ204టీవీడీగా గుర్తించారు. హుబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా నక్షత్రం ధ్వంసం అవుతున్న చిత్రాన్ని తీశారు.


ఈ ఘటన సుమారు 600 మిలియన్ కాంతి సంవత్సరాల క్రితం జరగ్గా అప్పుడు వెలువడిన కాంతి ఇన్నాళ్లకు హబుల్ స్పేస్ టెలిస్కోప్‌కు చేరిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకానొక నక్షత్రం కృష్ణబిలానికి చాలా దగ్గరగా వచ్చి చివరకు దాని గురుత్వాకర్షణ శక్తి కారణంగా కృష్ణబిలంలో పడిపోయింది. ఈ సందర్భంగా నక్షత్రం పూర్తిస్థాయిలో ధ్వంసమయ్యే సమయంలో వెలువడిన శకలాలు బ్లాక్ హోల్ చుట్టూ వేగంగా పరిభ్రమిస్తూ తీవ్ర ఉష్ణోగ్రతల వద్ద మండి భారీ కాంతిని వెదజల్లుతాయి. దీన్ని టోటల్ డిస్‌రప్షన్ ఈవెంట్ (టీడీఈ) అని అంటారు. టీడీఈ సందర్భంగా వెలువడిన కాంతి మనకు చేరిందని శాస్త్రవేత్తలు వివరించారు.


సాధారణంగా కృష్ణ బిలాలు గ్యాలెక్సీ మధ్యలో ఉంటాయి. అయితే, ఈ కృష్ణ బిలం మాత్రం ఓవైపు కనిపించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి బ్లాక్‌హోల్‌ను గుర్తించడం ఇదే తొలిసారి. రెండు గ్యాలెక్సీలు ఢీకొన్న సమయంలో జరిగిన విస్ఫోటనాలు ఈ బ్లాక్‌హోల్ ఓవైపునకు నెట్టివేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఇలాంటి బ్లాక్ హోల్స్ అధ్యయం ద్వారా విశ్వం పుట్టుకకు సంబంధించిన రహస్యాలను తెలుసుకోవచ్చని అంటున్నారు. బ్లాక్ హోల్స్ గురుత్వాకర్షణ శక్తి నుంచికాంతి కూడా బయటపడలేదు. దీంతో, వీటిని గుర్తించడం అసాధ్యం. టీడీఈ జరిగిన సందర్భాల్లో వెలువడే కాంతి ద్వారా బ్లాక్ హాల్స్‌ను లోతుగా అధ్యయనం చేయడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ

భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు

వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

Read Latest and Viral News

Updated Date - May 09 , 2025 | 09:28 PM