Dangerous Dog Breeds: ఈ కుక్కలు యమ డేంజర్.. దాడి చేస్తే ప్రాణాలు ఔటే!
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:43 PM
ప్రస్తుతం దేశంలో మనుషులపై కుక్కలు దాడులు చేస్తున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. వీటి దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడి ఎక్కువగా ఉంటుంది. ఇవి దాడి చేసినప్పుడు మన శరీరంపై తీవ్రమైన గాయాలు ఏర్పడతాయి. అయితే..
ప్రస్తుతం దేశంలో మనుషులపై కుక్కలు దాడులు చేస్తున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. వీటి దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడి ఎక్కువగా ఉంటుంది. ఇవి దాడి చేసినప్పుడు మన శరీరంపై తీవ్రమైన గాయాలు ఏర్పడతాయి. అయితే కుక్క జాతిని బట్టి వాటి దాడి తీవ్రత అనేది కూడా ఆధార పడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక కుక్క కాటు తీవ్రతను పౌండ్స్ ఫర్ స్క్వేర్ ఇంచ్(PSI)లో కొలుస్తారు. వాటి తల ఆకారం, శరీర పరిమాణం, దవడ కండరాలు, ఇతర అంశాల ఆధారంగా వీటి దాడి తీవ్రతలో తేడాలు ఉంటాయి.
వివిధ జాతుల కుక్కలు, వాటి PSI స్థాయి:
కంగల్-740
బోయర్‌బోయెల్- 700
కేన్ కార్సో - 700
అల్ బాయ్ డాగ్ - 650
టొస ఇను డాగ్ -556
ప్రెస కెనారియో డాగ్- 540
అర్జెంటినా డాగ్- 500
రోట్ వీలర్ డాగ్-328
జర్మన్ షెపర్డ్- 238
పిట్ బుల్ టెర్రియర్- 235
కుక్కల ప్రమాదకర స్వభావం వాటి జాతిపై మాత్రమే ఆధారపడదని నిపుణులు చెబుతున్నారు, తప్పుడు శిక్షణ, దుర్వినియోగం, వాటి ఒంటరితనం వల్ల ఏ జాతి కుక్క అయినా ప్రమాదకరంగా మారవచ్చని అంటున్నారు.
ఇవి కూడా చదవండి...
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చిందంటే...
పిల్లలపై ఒత్తిడి పెరుగుతోంది.. తల్లిదండ్రులు ఆలోచించాలి
Read Latest AP News And Telugu News