-
-
Home » Prathyekam » telugu Viral trending Telangana Andhra Pradesh national and international Breaking news 12th nov 2025 kjr
-
BREAKING: ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం
ABN , First Publish Date - Nov 12 , 2025 | 06:09 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 12, 2025 09:16 IST
ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం
727 పాయింట్లకు చేరిన కాలుష్య స్థాయి..
హైబ్రిడ్ మోడ్‌లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు..
గ్రాఫ్ 3 విధానాలను అమలుపరుస్తున్న ఢిల్లీ ప్రభుత్వం..
ప్రైవేటు సంస్థలు సైతం వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ మోడ్ లో పని చేయాలని ప్రభుత్వం ఆదేశం..
అన్ని రకాల నిర్మాణ పనులు నిలిపివేత, బీఎస్ 3 పెట్రోల్ వాహనాలు, బీఎస్ 4 డీజిల్ వాహనాలు ఢిల్లీ లోపలికి నిషేధం ..
అంతరాష్ట్ర బస్సు సర్వీస్‌లకూ నో ఎంట్రీ.
-
Nov 12, 2025 09:02 IST
బాలీవుడు నటుడు గోవిందాకు అస్వస్థత
ముంబై: బాలీవుడు నటుడు గోవిందాకు అస్వస్థత
నివాసంలో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయిన గోవిందా
ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స
-
Nov 12, 2025 08:59 IST
నేడు డాక్ యార్డ్ వంతెన ప్రారంభం
విశాఖ: నేడు డాక్ యార్డ్ వంతెన ప్రారంభం
భారీ వాహనాలకు మినహా మిగిలిన అన్ని రకాల వాహనాలకు అనుమతులు..
రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోర్ట్ అధికారులు..
తీరనున్న పారిశ్రామిక ప్రాంతవాసుల ప్రయాణ కష్టాలు.
-
Nov 12, 2025 07:56 IST
ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను: కొండా సురేఖ
అర్థరాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కొండా సురేఖ..
నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను..
ఆయన మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం నాకు లేదు..
ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలని, అపకీర్తి కలిగించాలనే ఉద్దేశ్యం నాకు ఎప్పటికీ లేదు..
నా వ్యాఖ్యల వల్ల ఏవైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే, దానికి నేను చింతిస్తున్నాను..
రేపు నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ..
విచారణకు ఒక రోజు ముందు నాగార్జునను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టిన కొండా సురేఖ.
-
Nov 12, 2025 06:48 IST
నేడు రాయచోటిలో సీఎం పర్యటన
అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండల పరిధిలో సీఎం చంద్రబాబు పర్యటన
పేదల పక్కా గృహాల గృహ ప్రవేశం, ప్రజావేదిక సమావేశం , జిల్లా టీడీపీ నేతలతో సమావేశంలలో పాల్గొననున్న సీఎం.
-
Nov 12, 2025 06:46 IST
నేడు దర్శనాల నిలిపివేత
నేడు వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాల నిలిపివేత
అభివృద్ధి పనుల కోసం దర్శనాలు నిలిపివేసిన అధికారులు
భీమన్న ఆలయంలో దర్శనాల కోసం ఏర్పాట్లు
సమాచారం లేకుండా దర్శనం నిలిపివేయడంపై భక్తుల ఆగ్రహం
-
Nov 12, 2025 06:18 IST
నేడు విచారణకు.. నటుడు ప్రకాష్‌రాజ్
హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ విచారణ
నేడు విచారణకు హాజరుకానున్న నటుడు ప్రకాష్‌రాజ్
నిన్న విజయ్ దేవరకొండను విచారించిన సీఐడీ
-
Nov 12, 2025 06:14 IST
ఏపీలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు
17 నెలల్లో ఇళ్లు పూర్తి చేసిన లబ్ధిదారులకు పంపిణీ..
అన్నమయ్య జిల్లా నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
-
Nov 12, 2025 06:13 IST
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు
CII ఇన్వెస్టర్ల సమ్మిట్‌పై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక భేటీలు
-
Nov 12, 2025 06:12 IST
నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్
విశాఖలో జరగనున్న సీఐఐ సమ్మిట్..
కేంద్రమంత్రులను ఆహ్వానించనున్న మంత్రి నారా లోకేష్.