Diwali Themes Instagram: దీపావళి వేళ.. ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు సూపర్ న్యూస్
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:08 PM
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా కొత్త కొత్త ఫీచర్లను, థీమ్స్ ను అందుబాటులోకి తెస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా ఇన్ స్టా గ్రామ్ కూడా యూజర్స్ కోసం దీపావళి స్పెషల్ గా కొత్త థీమ్స్ ను అందుబాటులోకి తెచ్చింది.
పండగల్లో దీపావళి చాలా ప్రత్యేకమైనది. ఈ ఫెస్టివల్‌ను పిల్లలు, పెద్దలు ఎంతో సంతోషంగా నిర్వహించుకుంటారు. ఇక దీపావళి స్పెషల్‌గా వివిధ సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగులకు బహుమతులు, ప్రత్యేకమైన వస్తువులు ఇస్తుంటాయి. అలానే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా కొత్త కొత్త ఫీచర్లను, థీమ్స్ ను అందుబాటులోకి తెస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రమ్ కూడా తన యూజర్స్ కోసం దీపావళి స్పెషల్ (Diwali Feature)గా కొత్త థీమ్స్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఇన్‌స్టాగ్రమ్ దీపావళి పండగ(Diwali Themes Instagram) వేళ కొత్త అంశాలను జోడించింది. ముఖ్యంగా రీ స్టైల్ ఫీచర్‌లో ఈ మార్పులు చేసింది. ఇప్పుడు ఎవరైనా ఇన్‌స్టా(Instagram) స్టోరీస్‌లో ఫోటోలు, వీడియోలు షేర్ చేసే ముందు.. కాస్త మార్పులతో దీపావళి ఎఫ్టెక్ కలిగే థీమ్స్ పొందవచ్చు. యూజర్లు.. తమ కంటెంట్‌కు పండుగ వాతావరణం ఇవ్వడానికి మూడు విభిన్న దీపావళి థీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మనకు నచ్చింది వాటి నుంచి ఎంచుకోవచ్చు.ఈ మూడు థీమ్స్ కూడా భారతీయ సంప్రదాయాలు, దీపావళి ఫెస్టివల్(Diwali) ఫీల్ కలిగేలా చేస్తాయని ఇన్‌స్టాగ్రమ్ చెబుతోంది.
ఇన్‌స్టాలో ఈ థీమ్స్‌ను ఎలా ఉపయోగించాలంటే..
తొలుత ఇన్‌స్టా(Instagram)యాప్‌ను తెరిచి, ప్లస్ బటన్‌ను నొక్కి, కథనాలకు వెళ్లాలి. మీ ఫోన్ నుంచి ఒక ఫొటోను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడే టాప్‌లో కుడి వైపున పెయింట్ బ్రష్‌తో సూచించబడిన Restyle సింబల్ నొక్కాలి. బాణాసంచా, క్రాకర్స్ , రంగోలి వంటి వివిధ థీమ్స్ కనిపిస్తాయి. ఒకదాన్ని ఎంచుకుని, మీ ఫొటోను ప్రాసెస్ చేయడానికి మెటా ఏఐ కొన్ని సెకన్ల సమయం తీసుకుంటుంది. చివరకు దీపావళి కాంతుల్లో, మీరు ఎంపిక చేసిన థీమ్‌లో మీ ఫొటో లేదా వీడియో కనిపిస్తుంది. అదే ఫీచర్ Edits యాప్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
కుక్క ఎంత పని చేసింది.. ఇల్లు తగలబడి పోయింది..
వామ్మో.. మాజీ ప్రియుడిపై ఇలా కూడా పగ తీర్చుకుంటారా? ఏం జరిగిందంటే..