Share News

Thailand Beach-Misbehaviour: బీచ్‌లో మహిళలకు వేధింపులు.. షాకింగ్ వీడియో వైరల్

ABN , Publish Date - Dec 13 , 2025 | 04:33 PM

థాయ్‌లాండ్‌లోని ఓ బీచ్‌లో ఇద్దరు విదేశీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన భారతీయుల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Thailand Beach-Misbehaviour: బీచ్‌లో మహిళలకు వేధింపులు.. షాకింగ్ వీడియో వైరల్
Thailand Viral Video

ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్‌లో భారతీయ టూరిస్టులు విదేశీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. @qoqsik పేరిట ఆన్‌లైన్‌లో పాప్యులర్ అయిన యూట్యూబర్ ఒకేసనా ఈ వీడియోను షేర్ చేశారు. తాను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో కొందరు తనను, మరో మహిళను అసభ్యంగా టచ్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు (Thailand Beach Video Viral).

సదరు యూట్యూబర్ ఇన్‌స్టాలో కూడా ఈ వీడయోను షేర్ చేశారు. థాయ్‌లాండ్‌‌లోని ఓ బీచ్‌లో ఆమె లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ అక్కడి వాతావరణాన్ని ప్రశంసించారు. ఇంతలో ఇద్దరు భారతీయులు మరో మహిళ కెత్ వద్దకు వెళ్లారు. ఆమె కూడా స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో యువతిని సమీపించారు. ఈ సందర్భంగా కెత్‌ కూడా తనకు ఫ్రెండేనని ఆ యూట్యూబర్ చెప్పింది. తాము ఇండియా నుంచి వచ్చామని వారు చెప్పారని తెలిపింది. బెంగళూరు, ముంబై వంటి నగరాల పేర్లను వారు ప్రస్తావించారని వెల్లడించింది. తనది థాయ్‌లాండ్ అని కెత్ చెప్పగా తాను రష్యా నుంచి వచ్చానని ఆ యూట్యూబర్ పేర్కొంది. ఈలోపు ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి కెత్‌తో ఫొటో దిగే ప్రయత్నంలో ఆమెపై చేయి వేయగా తాను అడ్డుపడ్డట్టు చెప్పింది. మళ్లీ తనపై కూడా చేయి వేసి ఫొటో దిగేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. ఈ క్రమంలో తాను గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలిపింది. ఆ తరువాత అక్కడ ఉండటం మంచిది కాదని భావించి మరో చోటకు వెళ్లిపోయినట్టు చెప్పింది.


ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో కలకలానికి దారి తీసింది. వేల కొద్దీ కామెంట్స్ వచ్చి పడ్డాయి. అసభ్యంగా ప్రవర్తించి ఆ వ్యక్తులపై జనాలు మండిపడ్డారు. ఇలాంటి పనులను అస్సలు సహించకూడదని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల ఇతర భారతీయులకు తలవంపులు వస్తున్నాయని కొందరు విచారం వ్యక్తం చేశారు. ఆ కుసంస్కారుల తరపున తాము క్షమాపణలు చెబుతున్నామని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!

జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..

Read Latest and Viral News

Updated Date - Dec 13 , 2025 | 05:27 PM