Share News

Air Travel: విమానం ఎక్కేముందు...

ABN , Publish Date - May 04 , 2025 | 05:54 AM

విమానం ఎక్కే ముందు కొన్ని ఆహారాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు, వికారం, తలనొప్పులు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్‌ కలిగించే ఆహారాలు, కారాలు, కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌, ఆల్కహాల్‌ వంటివి నివారించాల్సినవని సూచిస్తున్నారు.

Air Travel: విమానం ఎక్కేముందు...

విమానం ఎక్కేముందు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిదనీ లేదంటే ప్రయాణంలో అనారోగ్య సమస్యలు తప్పవనీ నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా అల్పాహారం కింద బ్రోకలీ, క్యాబేజీ తురుము, వెనిగర్‌ వేసి తయారు చేసిన సలాడ్స్‌ తీసుకుంటూ ఉంటారు. వీటివల్ల గ్యాస్‌ చేరి కడుపు ఉబ్బరిస్తుంది. ఉదయం వేళ విమాన ప్రయాణం చేయాల్సి ఉంటే వీటిని తినకపోవడమే మంచిది.

విమానం ఎక్కడానికి ఒక రోజు ముందు నుంచి బీన్స్‌, పప్పు దినుసులు తినకూడదు. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి విమానం ఎక్కగానే కడుపులో సమస్యలు ఏర్పడవచ్చు.

నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్‌, వీధుల్లో అమ్మే పదార్థాలు తినకూడదు. వీటివల్ల కడుపులో వికారం, వాంతులు, తలనొప్పి లాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.

విమానం ఎక్కడానికి గంట ముందు నుంచి కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌, ఆల్కహాల్‌ తీసుకోకూడదు. వీటివల్ల కడుపులో తిప్పడం, తల తిరగడం, తేన్పులు, కడుపు ఉబ్బరించడం లాంటివి ఏర్పడవచ్చు. సరిగా నిద్ర పట్టక అలసటగా అనిపిస్తుంది.

కొంతమందికి చూయింగ్‌ గమ్‌ నమలడం, క్యాండీస్‌ తినడం అలవాటుగా ఉంటుంది. వీటివల్ల కూడా సమస్యలు ఏర్పడవచ్చు.

విమానం ఎక్కేముందు కారంగా ఉన్నవి, మసాలాలు చేర్చిన ఆహార పదార్థాలు తినకూడదు. వీటి వల్ల గుండెలో మంటగా అనిపిస్తుంది.


ఇవి కూడా చదవండి

Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి

IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..

Updated Date - May 04 , 2025 | 05:54 AM