Share News

Pigeon Hospital: దేశంలోనే పావురాలకు ఏకైక ఆసుపత్రి.. ఎక్కడ ఉందంటే..

ABN , Publish Date - May 04 , 2025 | 02:38 PM

Pigeon Hospital: ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి చికిత్స కోసం దేశవ్యాప్తంగా ఆసుపత్రులు ఉన్నాయి. అలాగే పశువులకు సైతం ఆసుపత్రులు ఉన్నాయి. కానీ పావురాలకు ఆసుపత్రులు ఉన్నాయా అంటే.. ఉందని చెబుతున్నారు. ఆ ఆసుపత్రి ఎక్కడంటే..

Pigeon Hospital: దేశంలోనే పావురాలకు ఏకైక ఆసుపత్రి.. ఎక్కడ ఉందంటే..
Pigeon Hospital

ప్రజలకు దేశవ్యాప్తంగా ఆసుపత్రులున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో పశువులకు ఆసుపత్రులు ఉన్నాయి. అయితే కేవలం పావురాలకు ఒక ఆసుపత్రి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. బెంగళూరులోని రాజాజీనగర్‌కు చెందిన వసంత్ రాజ్ రంకా 30 ఏళ్లుగా.. దేశంలో ఏకైక పావురాల ఆసుపత్రని నిర్వహిస్తున్నారు. రాజాజీనగర్‌లోని 3వ క్రాస్‌లో సంకేశ్వర్‌ పార్శ్వనాథ్‌ జైన్‌ కబూతర్‌ దాన్‌ సేవా పేరుతో ఈ పావురాల ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.ఈ ఆసుపత్రిలో రోజూకు వందలాది పావురాలకు చికిత్స అందిస్తారు.

pigeon1.jpg


గత 30 ఏళ్లుగా ..

పావురాలకు సేవ చేయడంతోపాటు.. వాటి ప్రాణాలు కాపాడటమే తమ లక్ష్యమని వసంత్ రాజ్ రంకా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బెంగళూరులో తప్పా.. ఎక్కడా పావురాల పునరావాస కేంద్రం కానీ.. ఆసుపత్రి కానీ లేదని ఆయన గుర్తు చేశారు. ఈ ఆసుపత్రి గత 30 సంవత్సరాలుగా పని చేస్తోందని ఆయన వివరించారు.ఈ నాలుగంతస్థుల భవనంలో పావురాలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు.


వివిధ వ్యాధులతో బాధపడే పావురాలకు ఇక్కడ చికిత్స అందిస్తామన్నారు. ఇప్పటివరకు.. లక్షకుపైగా పావురాలకు చికిత్స అందించామని వివరించారు. ప్రతి రోజూ 40 నుండి 50 పావురాలకు చికిత్స అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం.. ఈ ఆసుపత్రిలో 5 వేలకు పైగా పావురాలకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పావురం శాంతికి ప్రతీక అని.. వాటిని మనం పెంచుకొంటే.. మన జీవితాల్లో శాంతి తప్పక నెలకొంటుందని నరేష్ రంకా పేర్కొన్నారు.


ఆసుపత్రి నిర్వహణకు ప్రతి ఏటా..

బెంగళూరులోని తొమ్మిది ప్రదేశాలలో ప్రతి రోజూ పావురాలకు ధాన్యాన్ని ఆహారంగా వేస్తామన్నారు. ప్రతిరోజూ చికిత్స కోసం 40 నుంచి 50 పావురాలను ప్రజలు తీసుకువస్తారని తెలిపారు. క్యాన్సర్ సహా ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పావురాలకు ఇక్కడ చికిత్స అందిస్తామన్నారు. ఈ ఆసుపత్రి నిర్వహణకు ప్రతి ఏటా రూ. 70 లక్షలు ఖర్చవుతుందని నిర్వాహాకులు వివరించారు.

ఇవి కూడా చదవండి

Jammu and Kashmir: లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ముగ్గురు జవాన్లు మృతి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

India Vs Pakistan: భారత్‌తో యద్ధంపై స్పందించిన పాక్ రాయబారి

Char Dham Yatra 2025: తెరుచుకున్న బద్రీనాథ్ దేవాలయం తలుపులు

Dr KV Subramaniam: డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంను విధుల నుంచి తొలగించిన కేంద్రం

Pakistan violates ceasefire: మళ్లీ కవ్వింపు చర్యలకు దిగిన పాక్

For National News And Telugu News

Updated Date - May 04 , 2025 | 03:06 PM