Share News

AI Homeless Man Prank: లవర్స్, పేరెంట్స్ కమిట్‌మెంట్‌ను లేడీస్ ఇలా చెక్ చేస్తున్నారు

ABN , Publish Date - Oct 26 , 2025 | 03:29 PM

మీరు ఒక లేడీ. ఇంట్లో ఉన్నారు. అకస్మాత్తుగా మీ బెడ్ రూంలోని బెడ్ మీద ఒక తెలీని వ్యక్తి వచ్చి కూర్చొన్నాడు. మీరు ఒక అబ్బాయ్. మీ మదర్ ఆఫీస్ కు లేదా బయటకు వెళ్లారు. మీ మదర్ బెడ్ రూంలో వేరే తెలీని వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉన్నాడు..

AI Homeless Man Prank: లవర్స్, పేరెంట్స్ కమిట్‌మెంట్‌ను లేడీస్ ఇలా చెక్ చేస్తున్నారు
AI Homeless Man Prank

ఇంటర్నెట్ డెస్క్: 1. మీరు ఒక లేడీ. ఇంట్లో ఉన్నారు. అకస్మాత్తుగా మీ బెడ్ రూంలోని బెడ్ మీద ఒక తెలీని వ్యక్తి వచ్చి కూర్చొన్నాడు. ఆ హఠాత్పరిణామాన్ని మీరు ఫొటో తీసి మీ నాన్నకు పంపించారు. విషయం చెప్పారు. మీ డాడీ రియాక్షన్ ఎలా ఉంటుంది? 2. మీరు ఒక అబ్బాయ్. మీ మదర్ ఆఫీస్ కు లేదా బయటకు వెళ్లారు. మీ మదర్ బెడ్ రూంలో వేరే తెలీని వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉన్నాడు. ఆ దృశ్యాన్ని మీరు ఫొటో తీసి మీ మదర్ కు పంపించి మెసేజ్ పెట్టారు. మీ మదర్ రియాక్షన్ ఎలా ఉంటుంది. ఇలాగే, ఒక తెలీని వ్యక్తి నేరుగా ఇంట్లోని కిచెన్ లో వండుకు తింటూ ఉన్న , టాయ్ లెట్ లో ఉన్న ఫొటోలు, ఇంట్లో ఎక్సర్ సైజ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు మీ వాళ్లకి పంపిస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు?


ఆ ఫొటోలు చూసిన వాళ్ల గుండెలాగిపోవూ.. కంగారు పడిపోరూ.. చైనా, అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఏఐ సాయంతో ఇలాంటి పనులు చేస్తున్నారు కొందరు యువత. ఈ పిచ్చి చేష్టలు ఇప్పుడు #AIHomelessManPrank (AI హోమ్‌లెస్ మ్యాన్ ప్రాంక్) పేరిట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇలా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, పార్ట్‌నర్స్, లవర్స్‌ను పరీక్షిస్తూ దడ పుట్టిస్తున్నారు. ఈ చాట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మిలియన్లలో వ్యూస్, కామెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు.


ముఖ్యంగా చైనాలో ఈ వింత వ్యవహారాలు బాగా వైరల్ అవుతున్నాయి. AI సాంకేతికతను ఉపయోగించి హోమ్‌లెస్ మనిషి ఇమేజ్‌లు, వీడియోలు తయారు చేసి తమ భర్తలు లేదా బాయ్‌ఫ్రెండ్‌లను 'పరీక్షించే' మహిళలు పెరుగుతున్నారు. ప్రేమికుల భావోద్వేగాలు, కమిట్‌మెంట్‌ను తనిఖీ చేయాలనే ఆశతో ఇలాంటి పనులు చేస్తున్నారు చైనాలోని మహిళలు, యువతులు. ఈ 'కన్‌సర్నింగ్ AI హోమ్‌లెస్ మ్యాన్ ప్రాంక్' అనే ట్రెండ్ చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాప్తి చెందింది.


దీనిపై ఆయా దేశాల్లోని పోలీసులు, నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి పిచ్చిపనులు చేస్తే, నిజంగా అపాయంలో ఉంటే, ఆదుకునే వాళ్లు కరువవుతారంటూ హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వాళ్లంతా ఈ ప్రాంక్ ఇమేజ్ లు, వీడియోలు ఎలా చేస్తున్నారనే విషయానికొస్తే.. గూగుల్ జెమిని (నానో బనానా) లేదా మైఎడిట్ AI రీప్లేస్ వంటి టూల్స్‌తో మహిళలు రియలిస్టిక్ ఇమేజ్‌లు సృష్టిస్తారు. వీటిలో హోమ్‌లెస్ మనిషి తమ ఇంట్లో లేదా పని చేసే ప్రదేశంలో కనిపించినట్టు చూపిస్తారు. ఉదాహరణకు, చైనా అంహుయి ప్రావిన్స్‌లోని ఒక మహిళ, తన భర్త ఫ్రెండ్స్‌తో డిన్నర్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఫొటోలు పంపింది. భర్త అది నిజమేనని భావించి పోలీసులకు కాల్ చేసేశాడు! ఇవీ తదనంతర పరిణామాలు.


ఇవి కూడా చదవండి:

పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు

పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 26 , 2025 | 05:47 PM