Share News

Minister Narayana: పాఠశాలలో వైసీపీ ఫ్లెక్సీలు.. మంత్రి నారాయణ ఆగ్రహం

ABN , Publish Date - Aug 11 , 2025 | 02:32 PM

నగరంలోనే ఫ్లెక్సీలు నిషేధిస్తే.. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఫ్లెక్సీలు ఏమిటని మంత్రి నారాయణ మండిపడ్డారు. మున్సిపల్, విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో రాజకీయాలు చేస్తున్నారా.. అని నిలదీశారు.

Minister Narayana: పాఠశాలలో వైసీపీ ఫ్లెక్సీలు.. మంత్రి నారాయణ ఆగ్రహం
Minister Narayana

నెల్లూరు: నగరంలో మున్సిపల్ పాఠశాలలను మంత్రి పొంగూరు నారాయణ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో తనిఖీ చేస్తుండగా.. వైసీపీ ఫ్లెక్సీలు బయటపడ్డాయి. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫ్లెక్సీలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు.


నగరంలోనే ఫ్లెక్సీలు నిషేధిస్తే.. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఫ్లెక్సీలు ఏమిటని మంత్రి నారాయణ మండిపడ్డారు. మున్సిపల్, విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో రాజకీయాలు చేస్తున్నారా.. అని నిలదీశారు. విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యంతో పిల్లల మనస్సులని పాడు చేయొద్దని సూచించారు. మరోసారి విద్యాసంస్థల్లో ఏ రాజకీయ పార్టీల నేతల ఫ్లెక్సీలు కనిపించినా, సీరియస్ యాక్షన్ తప్పదని మంత్రి నారాయణ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్

సిగ్గు చేటు జగన్: హోమ్ మంత్రి అనిత

Updated Date - Aug 11 , 2025 | 09:58 PM