CM Revanth Reddy: గ్రూప్ -2 అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Oct 19 , 2025 | 06:43 AM

గ్రూప్ -2 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శనివారం నాడు శిల్ప కళావేదికలో ఉద్యోగ నియామక పత్రాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందజేశారు. రేపటి నుంచి ఈ సైన్యం తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుతారని వ్యాఖ్యానించారు. అమరవీరుల ఆశయ సాధన, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 1/14

గ్రూప్ -2 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శనివారం నాడు శిల్ప కళావేదికలో ఉద్యోగ నియామక పత్రాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందజేశారు.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 2/14

రేపటి నుంచి ఈ సైన్యం తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుతారని వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 3/14

అమరవీరుల ఆశయ సాధన, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 4/14

దసరాకు ముందు 562 మందికి గ్రూప్‌-1 నియామక పత్రాలు అందించామని, ఇప్పుడు దీపావళికి ముందు 783 మందికి గ్రూప్‌-2 నియామక పత్రాలు అందిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 5/14

ఉద్యోగులూ.. తల్లిదండ్రులను సంరక్షించుకోవడం.. పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత అని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 6/14

రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని సూచించారు.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 7/14

ఉద్యోగులు ఎవరైనా వారి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. వారి జీతంలో నుంచి 10 నుంచి 15 శాతం కోత విధిస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 8/14

ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తానని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 9/14

ఒకటో తేదీన మీకు జీతం ఎలా వస్తుందో.. అలాగే ఆ మొత్తం మీ తల్లిదండ్రుల ఖాతాలో కూడా ఒకటో తేదీనే పడుతుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 10/14

ఈ మేరకు త్వరలో చట్టం తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 11/14

ఇప్పటి వరకూ మీరు సామాన్యులని, ఈరోజు నుంచి అధికారులని, బాధ్యతను సమర్థంగా నిర్వహించి ‘రైజింగ్‌ తెలంగాణ - 2047’ విజన్‌ డాక్యుమెంట్‌కు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 12/14

అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలపాలని నిర్దేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 13/14

నిస్సహాయులకు సహాయం చేయాలని, పేదలకు అండగా నిలవాలని ఉద్బోధించారు.

CM Revanth Reddy: గ్రూప్ -2  అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి 14/14

ఉద్యోగాలను భర్తీ చేయడమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated at - Oct 19 , 2025 | 07:26 AM