Yuvagalam Padayatra : యువగళానికి రెండేళ్లు.. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో సంబురాలు
ABN, Publish Date - Jan 27 , 2025 | 05:28 PM
జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనపై ప్రజలను చైతన్యం చేస్తూ, యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ఇవాళ(సోమవారం) రెండేళ్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుకలను టీడీపీ కార్యాలయాల్లో ఆ పార్టీ నేతలు ఘనంగా చేసుకుంటున్నారు. కేకు కట్ చేసి తినిపించుకుంటున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించిన లోకేశ్ పాదయాత్ర చేపట్టి సోమవారంతో రెండేళ్లు ముగిశాయి.

ఏపీలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర సాగింది.

యువగళం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కేకు కట్ చేసి నాయకులు తినిపించుకున్నారు.

టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు కాల్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జీవీ రెడ్డి, అశోక్ బాబు తదితర నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాదెండ్ల బ్రహ్మం యువగళం పాదయాత్రకు సంబంధిచిన పలు కీలక విషయాలను నేతలతో గుర్తుచేసుకున్నారు.

నారా లోకేష్ రెడ్ బుక్‌ను చూస్తే వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందని నేతలు అన్నారు.
Updated at - Jan 27 , 2025 | 05:40 PM