Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం..

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:32 AM

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా విశాఖపట్నం సాగరతీరంలో నిర్వహించిన 'యోగాంధ్ర' కార్యక్రమం రికార్డులు కొల్లగొట్టింది. కనీ వినీ ఎరగని స్థాయిలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేశారు.

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 1/16

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో 'యోగాంధ్ర' కార్యక్రమం ఘనంగా నిర్వహించింది.

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 2/16

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 3/16

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంతో విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌ సందడిగా మారింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేశారు.

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 4/16

విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (Guinness Record) స్థానం దక్కించుకుంది.

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 5/16

ఇంతకు ముందు సూరత్‌లో 1.5 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డ్ సృష్టించారు. కాగా, శుక్రవారం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో అల్లూరి జిల్లాలోని 106 పాఠశాలలకు చెందిన 25వేల మంది విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 6/16

ప్రధాని మోదీని సాదరంగా ఆహ్వానిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 7/16

ప్రధానికి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 8/16

మంత్రి నారాలోకేష్ ను భుజం తట్టి ఆప్యాయంగా పలకరిస్తున్న ప్రధాని మోదీ

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 9/16

యోగాంధ్రలో అబ్బురపరిచే విన్యాసాలతో అలరించిన చిన్నారులు.

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 10/16

తీరం పొడవునా యోగాసనాలు వేస్తున్న లక్షలాది మంది ప్రజలు

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 11/16

యోగాసనాలు వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 12/16

యోగా చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 13/16

యోగాంధ్ర కార్యక్రంలో పాల్గొన్న విదేశీయులు

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 14/16

కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 15/16

యోగాంధ్రలో పాల్గొన్న విద్యార్థులు, యువత

Yogandhra: విశాఖ తీరంలో కన్నులపండువగా సాగిన యోగాంధ్ర ప్రత్యేక ఫొటోల సమాహారం.. 16/16

కార్యక్రమంలో తిరుగుపయనమైన ప్రధాని మోదీ. వీడ్కోలు చెబుతున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం తదితరులు

Updated at - Jun 21 , 2025 | 01:41 PM