విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ

ABN, Publish Date - Apr 28 , 2025 | 07:16 AM

సామాజిక, రాజకీయ, ఆర్థిక, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ రాసిన వ్యాసాల సంకలనం సత్యకాలమ్ 2 పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. భారతదేశ సామాజిక పరివర్తనకు, జాతీయ అభివృద్ధికి కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న యువత తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇదని కిషన్‌రెడ్డి తెలిపారు.

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 1/18

సామాజిక, రాజకీయ, ఆర్థిక, జాతీయ భద్రత వంటి అంశాలపై ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ (Satya Kumar) వ్యాసాల సంకలనంతో కూడిన సత్యకాలమ్ 2 బుక్‌ను రాశారు.

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 2/18

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఆదివారం నాడు జరిగింది.

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 3/18

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 4/18

కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 5/18

భారతదేశ సామాజిక పరివర్తనకు, జాతీయ అభివృద్ధికి కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న యువత తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇదని కిషన్‌రెడ్డి తెలిపారు.

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 6/18

టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు బుక్ అందజేస్తున్న మంత్రి సత్యకుమార్

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 7/18

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారికి కిషన్‌రెడ్డి, సత్యకుమార్ , నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 8/18

సత్యకాలమ్ బుక్‌ను గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు అందజేస్తున్న మంత్రి సత్యకుమార్

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 9/18

కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్‌ను గజమాలతో సన్మానిస్తున్న బీజేపీ నేతలు

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 10/18

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 11/18

ఎన్నో ఏళ్లు పత్రికల్లో రాసిన వ్యాసాల సంకలనమే సత్యకాలమ్ 2 పుస్తకమని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాల్లో వచ్చిన గుణాత్మక మార్పులు చెప్పడానికే ఈ పుస్తకం రాశానని వెల్లడించారు.

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 12/18

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారికి మౌనం పాటిస్తున్న ప్రముఖులు

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 13/18

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లకు బుక్ అందజేస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 14/18

కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్‌ను గజమాలతో సన్మానిస్తున్న నేతలు

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 15/18

సత్యకాలమ్ బుక్ ఆవిష్కరణకు వచ్చిన ప్రముఖులకు నమస్కరిస్తున్న మంత్రి సత్యకుమార్

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 16/18

సత్యకాలమ్ బుక్ ఆవిష్కరణలో సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తున్న కళాకారులు

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 17/18

గత మూడేళ్లుగా వివిధ పత్రికల్లో సత్యకాలం శీర్షికలో దేశ, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై ప్రచురించిన వ్యాసాల సంకలనం సత్యకాలం-2 పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొని మొదటి ప్రతిని అందుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ 18/18

ఈ పుస్తకం చదివితే మంత్రి సత్యకుమార్ మనస్తత్వం అర్థమవుతుందని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ పుస్తకం యువ రాజకీయ నాయకులు, రచయితలకు ప్రేరణగా ఉంటుందని ఉద్ఘాటించారు.

Updated at - Apr 28 , 2025 | 07:49 AM