AP Mega DSC Event: ఘనంగా మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ..
ABN, Publish Date - Sep 25 , 2025 | 09:48 PM
అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైన 15,941 అభ్యర్థులకు నియమాక పత్రాలను అందజేశారు. అనంతరం కొద్దిసేపు టిచర్లతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలు ఇచ్చారు. అనంతరం సభను ఉద్దేశించి చంద్రబాబు ప్రసగించారు. ఇకపై ప్రతిఏటా DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని నిరుద్యోగులకు శభవార్త చెప్పారు.
1/6
అమరావతిలో నిర్వహించిన మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హజరయ్యారు. ఈ మేరకు టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారికి అభినందనలు తెలిపారు.
2/6
డీఎస్సీ ఉత్సవ్ సభను ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ ప్రసంగించారు. ముందుగా నియామక పత్రాలు అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. టిచర్లతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. డీఎస్సీలో 15,941 మంది అభ్యర్థులు టీచర్లుగా ఎంపికైనట్లు తెలిపారు. టీచర్లుగా నియమితులైన వాళ్లల్లో 7,955 మంది మహిళలు, 7,986 మంది పురుషులు ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. పురుషులతో సమానంగా దాదాపు 50 శాతం మంది మహిళలు ఎంపిక కావడం ఈ మెగా డీఎస్సీ విశిష్టత అని లోకేశ్ వెల్లడించారు.
3/6
మెగా డీఎస్సీ ప్రక్రియను 150 రోజుల్లో పూర్తి చేసిన మంత్రి నారా లోకేష్ పూర్తి చేశారు. 1994 నుంచి 2025 వరకు 14 డీఎస్సీలను నిర్వహించిన చంద్రబాబు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల నుంచి నియామక పత్రాలు అందుకునేందుకు కుటుంబ సభ్యులతో కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు తరలివచ్చారు. డీఎస్సీకి ఎన్ని అడ్డంకులు వచ్చిన వాటిని అధిగమించి.. డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టిన లోకేశ్‌కు అభ్యర్థు కృతజ్ఞతలు తెలుపుతు పాలాభిషేకం చేశారు.
4/6
సభా సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. మెగా డీఎస్సీ అభ్యర్థులు అడిగిన ప్రశ్నల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఫోటో చూసిన టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
5/6
అమరావతిలో నిర్వహించిన మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైన 15,941 అభ్యర్థులకు నియమాక పత్రాలను అందజేశారు. దీంతో వారు అనందంతో.. మెగా డీఎస్సీ నియామక పత్రాలు పట్టుకుని హర్షం వ్యక్తం చేశారు.
6/6
మెగా డీఎస్సీ ఉత్సవ్ సభా ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. టీడీపీ శ్రేణులు, టీచర్ల హర్షధ్వానాలతో కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమానికి భారీగా టీడీపీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు. డీఎస్సీ అభ్యర్థులు కూడా వారి కుటుంబ సభ్యులతో రావడంతో.. సభా ప్రాంగణమంతా మరింతగా కిక్కిరిసిపోయింది.
Updated at - Sep 25 , 2025 | 09:50 PM