Green Tax: వాహనాలకు గ్రీన్ ట్యాక్స్.. ఎప్పటి నుంచంటే?
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:10 AM
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బయట నుంచి రాష్ట్రంలోకి వచ్చే ఇతర వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ నుంచి బయటి రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్లే వాహనాల నుంచి ఈ గ్రీన్ ట్యాక్స్ వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్, అక్టోబర్ 26: రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడేందుకు, కాలుష్యాన్ని నివారించేందుకు అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బయట నుంచి రాష్ట్రంలోకి వచ్చే ఇతర వాహనాలకు గ్రీన్ ట్యాక్స్(Uttarakhand Introduces Green Tax) విధిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ నుంచి బయటి రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్లే వాహనాల నుంచి ఈ గ్రీన్ ట్యాక్స్(Green Tax) వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
గ్రీన్ ట్యాక్స్‌లో భాగంగా వాహనాల పరిమాణ(vehicle tax Uttarakhand) బట్టి రేట్లు నిర్ణయించారు. చిన్న వాహనాలకు రూ. 80, చిన్న కార్గో వాహనాలకు రూ. 250, బస్సులకు రూ. 140, ట్రక్కులకు వాటి బరువును బట్టి రూ. 120 నుండి రూ. 700 వరకు గ్రీన్ టాక్స్ కట్టాల్సి ఉంటుంది.ఇక దీన్ని పక్కా అమలు చేసేందుకు.. రాష్ట్ర సరిహద్దుల వెంబడి ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను సంగ్రహిస్తాయని రాష్ట్ర అదనపు రవాణా కమిషనర్ సనత్ కుమార్ సింగ్ శనివారం తెలిపారు. రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే 16 కెమెరాలు ఉన్నాయని, వాటి సంఖ్యను ఇప్పుడు 37కి పెంచుతామని ఆయన అన్నారు.
ఈ గ్రీన్ ట్యాక్స్ ను వసూలు చేసేందుకు ఓ థర్డ్ పార్టీ కంపెనీని ప్రభుత్వం నియమించిందని సింగ్ చెప్పారు. కెమెరాల ద్వారా సంగ్రహించబడిన డేటాను సాఫ్ట్‌వేర్ ద్వారా సదరు సంస్థకు పంపుతామని తెలిపాడు. ఆ తర్వాత ఉత్తరాఖండ్(Uttarakhand Green Tax)లో రిజిస్టర్డైన ప్రభుత్వ, ద్విచక్ర వాహన వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని వేరు చేసి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటాబేస్‌కు పంపుతామని ఆయన వెల్లడించారు. NPCI ద్వారా వాహన యజమానుల వాలెట్ నంబర్‌లను శోధించి, సదరు వాహనంకు సంబంధిచిన మొత్తం ఆటోమెటిగా రవాణా శాఖ ఖాతా(NPCI payment system)లో జమ చేస్తామని సనత్ కుమార్ సింగ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి