Hair Transplant: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న కొన్ని గంటలకే..
ABN , Publish Date - May 16 , 2025 | 09:44 PM
Hair Transplant: హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం వెళ్లి.. ఇద్దరు ఇంజనీర్లు విగత జీవులుగా మారారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అది కూడా ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న కొన్ని గంటలకే వారు మరణించారు.
లక్నో, మే 16: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న ఇద్దరు ఇంజనీర్లు కొన్ని గంటల్లోనే మరణించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన నిర్వాహకులను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా.. వారు అప్పటికే పరారయ్యారు. వారిని గాలించడం కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ ఏడాది మార్చి 13వ తేదీన కాన్పూర్‌లోని డాక్టర్ అనుష్క తివారీ క్లినిక్ హెయిర్ ప్లాంట్ చేయించుకునేందుకు వినీత్ దుబే (40) వెళ్లారు. ఈ హెయిర్ ప్లాంట్ చేయించుకుని వెంటనే ఇంటికి వచ్చిన ఆయన అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ముఖమంతా వాపు వచ్చేసింది. తీవ్రమైన నొప్పితో బాధపడ్డారు. ఆ క్రమంలో మార్చి 14వ తేదీన వినీత్ దుబే మరణించాడు. దీంతో అతడి భార్య జయా త్రిపాఠీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక ఖాతా ఎక్స్‌లో డాక్టర్ అనుష్క తివారీ క్లినిక్‌పై ఫిర్యాదు చేశారు.
ఈ నేప్యథ్యంలో త్రిపాఠీ ఫిర్యాదు మేరకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్ డీసీపీ విజేందర్ దివ్వేది శుక్రవారం వెల్లడించారు. నిర్వహాకుల నిర్లక్ష్యం కారణంగానే దుబే చనిపోయినట్లు కేసు నమోదు చేశామని తెలిపారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కు వెళ్లి మృతి చెందిన వినీత్ దుబే వ్యవహారం సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది.
దీంతో కుశాగ్ర ఖతియార్ అనే వ్యక్తి.. గురువారం కన్పూర్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. తన సోదరుడు మాయంక్ ఖతియార్ (30) గతేడాది నవంబర్ 18వ తేదీన ఇదే.. డాక్టర్ అనుష్క తివారీ క్లినిక్‌లో హెయిర్ ప్లాంట్ చేయించుకున్నారని చెప్పారు. అనంతరం తీవ్ర అనారోగ్యం పాలైన తన సోదరుడు ఆ మరునాడే మరణించాడని పోలీస్ కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేశారు. దీంతో ఈ కేసును దుబే కేసుతో కలిపి ఖతియార్ అంశాన్ని విచారించాలా? లేకుంటే మరో కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు చేపట్టాలా అనే సందిగ్ధంలో పోలీసులు ఉన్నారు. ఏదీ ఏమైనా ఈ కేసు దర్యాప్తు త్వరిత గతిన చేపట్టి.. నిందితులను శిక్షించాలని బాధిత కుటుంబాలను ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ తరహా ఘటనలు మరోకరికి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా కుటుంబాలు.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
పిల్లల మర్రికి ప్రపంచ సుందరీమణులు
AP Liquor Scam: లిక్కర్ స్కామ్.. మరో ఇద్దరి అరెస్ట్..
Indonesia: ఇండోనేషియాలో అల్లర్లు.. 20మంది మృతి
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
Terrorists Arrested: తీవ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు సీజ్
Crime News: యజమాని భార్యతో వివాహేతర సంబంధం.. డ్రైవర్ బెదిరింపులు
Operation Sindoor: సత్తా చాటిన ఆకాశ్
For National News And Telugu News