AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
ABN , Publish Date - May 16 , 2025 | 06:46 PM
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం నమోదుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని రాజ్ కసిరెడ్డిని ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో ధనుంజయ్ రెడ్డితోపాటు కృష్ణమోహన్ రెడ్డిలను ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.
అమరావతి, మే 16: ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం నమోదుకు ఏసీబీ కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని రాజ్ కసిరెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణ మే 19వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఇదే లిక్కర్ కేసులో ఏ 33గా ఉన్న గోవిందప్ప బాలాజీ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. ఈ నెల 19కి విచారణ వాయిదా పడింది. అటు ఇదే కేసులో రిటైర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో డిస్మిస్ అయ్యాయి. దీంతో వారి అరెస్ట్‌కు రంగం సిద్దమైంది. ఇక సుప్రీంకోర్టు ఉత్తర్వులు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. అవి రాగానే వీరిని అరెస్ట్ చేసే అవకాశముంది.
మరోవైపు మద్యం కుంభకోణంలో అరెస్టయిన వారంతా.. ఈ కేసుతో తమకు ఏమాత్రం సంబంధం లేదని గతంలో చెప్పారు. కానీ సిట్ మాత్రం స్పష్టమైన ఆధారాలు సేకరించింది. దీంతో ఈ కేసులో ఇవి కీలకమైనాయి. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే ఈ కేసులో సూత్రధారి, పాత్రదారిగా ఆయన వ్యవహరించారు. అలాగే చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ చేసి కీలక సమాచారం రాబట్టారు.
అయితే గోవిందప్ప బాలాజీ, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్లు సైతం బయటకు రావడంతో.. ఈ కేసు మరింత సంచలనమైంది. గత మూడు రోజులుగా ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారిస్తున్నారు. వీరిని విడివిడిగానే కాదు.. కలిపి విచారించారు. ఈ సందర్భంగా వీరి నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రికి వీరిద్దరి అరెస్ట్ చేసే అవకాశముందని.. అందులోభాగంగా వీరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఈ కేసులో ఈడీ సైతం విచారణ చేపట్టనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
Terrorists Arrested: తీవ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు సీజ్
Crime News: యజమాని భార్యతో వివాహేతర సంబంధం.. డ్రైవర్ బెదిరింపులు
Operation Sindoor: సత్తా చాటిన ఆకాశ్
For More AP News and Telugu News