Terrorists Arrested: తీవ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు సీజ్
ABN , Publish Date - May 16 , 2025 | 05:58 PM
Terrorists Arrested: జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు తీవ్రవాదులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. వీరికి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని తెలిపాయి.
శ్రీనగర్, మే 16: జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు శుక్రవారం అరెస్ట్ చేశాయి. వీరికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని తెలిపాయి. వీరి వద్ద నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేసినట్లు వివరించాయి. ఈ ప్రాంతంలో వీళ్లు ఉగ్రవాద చర్యలకు పాల్పడడమే కాకుండా.. స్థానికులను ఉగ్రవాదం వైపు మళ్లీంచేందుకు ప్రోత్సహిస్తున్నారని చెప్పాయి. ఈ ముగ్గురు ముజామిల్ అహ్మద్, ఇషాక్ పండిట్, మున్నీర్ అహ్మద్‌గా గుర్తించామన్నారు. వీరిని మగమ్‌లో అరెస్ట్ చేశామన్నారు.
లష్కరే తోయిబా సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న అబిద్ ఖయ్యుమ్ లోన్‌తో నేరుగా సంప్రదింపులు జరిపేంత చనువు వీరికి ఉందని పేర్కొన్నాయి. 2020లో అబిద్ ఖయ్యుమ్ లోన్.. పాకిస్థాన్ పారిపోయి.. లష్కరే తోయిబాలో చేరాడని వివరించాయి. ఇతరు పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తూ.. బద్గాం జిల్లాలోని ప్రజలను ఉగ్రవాదం వైపు మళ్లీంచేందుకు సన్నాహాకాలు చేపడుతున్నాడని తెలిపాయి. అతడి ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ఈ ముగ్గురు పని చేస్తున్నారని భద్రతా దళాలు వివరించాయి. అయితే వీరిని విచారిస్తున్నామని భద్రతా దళాలు తెలిపాయి.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటనకు పాకిస్థాన్‌దే బాధ్యత అనేందుకు భారత్ సాక్ష్యాలను సేకరించింది. వీటిని ప్రపంచం ముందు ఉంచింది. అంతేకాదు.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సైతం కీలక నిర్ణయాలు చేపట్టింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అలాంటి వేళ.. పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను దాడి చేసి.. 100 మందికిపైగా ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. ఈ చర్యకు ఆపరేషన్ సిందూర్ అని భారత్ పేరు పెట్టింది. దీంతో పాక్ సైతం.. తన దేశ సరిహద్దులకు అనుకున్ని ఉన్న భారత్‌లోని పలు రాష్ట్రాలపైకి డ్రోనులు, క్షిపణులతో దాడి చేసింది.
ఈ దాడులను భారత్ తిప్పికొట్టంది. అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. అయితే పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని జిల్లాల్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఆ క్రమంలో పలు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. అలాగే పలువురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Crime News: యజమాని భార్యతో వివాహేతర సంబంధం.. డ్రైవర్ బెదిరింపులు
Operation Sindoor: సత్తా చాటిన ఆకాశ్
Boycott Turkey: తుర్కియేకు సీఏఐటీ షాక్.. వర్తక, వాణిజ్య సంబంధాలు నిలిపివేత..
Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో 50 వేల కోట్ల నిధులు
For National News And Telugu news