Share News

Kerala Local Body Elections: యూడీఎఫ్, ఎన్డీయేకు కలిసొచ్చిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు

ABN , Publish Date - Dec 13 , 2025 | 09:40 PM

కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మెజారిటీ గ్రామ పంచాయతీలను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది.

Kerala Local Body Elections: యూడీఎఫ్, ఎన్డీయేకు కలిసొచ్చిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు
Kerla Local Body Elections

తిరువనంతపురం: కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ (LDF) గతంలో సాధించిన ఫలితాలను పునరావృతం చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ (UDF) మెజారిటీ గ్రామ పంచాయతీలను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆ పార్టీలో మరింత ధీమా పెరిగేలా ఫలితాలు వెలువడ్డాయి. తిరువనంతపురం కార్పొరేషన్‌ను ఎన్డీయే గెలుచుకోవడం బీజేపీ శ్రేణుల్లో సంతోషం నింపింది.


తిరువనంతపురం కార్పొరేషన్‌ను ఎన్డీయే సొంత చేసుకుంది. 45 ఏళ్ల కామ్రేడ్ల ఆధిపత్యానికి గండికొట్టింది. ఎన్డీయే కూటమి 101 మంది సభ్యుల కౌన్సిల్‌లో 50 సీట్లు గెలుచుకుంది. దీంతో ఎల్‌డీఎఫ్ అధీనంలోని తిరువనంతపురం కౌన్సిల్ ఎన్డీయే చేతికి చిక్కింది.


యూడీఎఫ్ 367 గ్రామ పంచాయతీల్లో మెజారిటీ సాధించింది. ఎల్‌డీఎప్ 234 గ్రామ పంచాయతీల్లో గెలవగా, ఎన్డీయే 5 గ్రామ పంచాయతీలు దక్కించుకుంది. కార్పొరేషన్లలో యూడీఎఫ్ 3 కార్పొరేషన్లలో పాగా వేసింది. ఎన్డీయే తిరువనంతపురంలో మెజారిటీ సాధించింది. పాలక్కాడు మున్సిపాలిటీని నిలబెట్టుకుంది. అక్కడ 53 సీట్లలో 25 గెలుచుకుంది. 14 జిల్లా పంచాయతీల్లో ఏడింటిని యూడీఎఫ్ దక్కించుకోగా, ఎల్‌డీఎఫ్ ఆరు స్థానాల్లో గెలిచింది.


రాహుల్ గాంధీ స్పందన

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్‌ సాధించిన విజయంపై రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. నిర్ణయాత్మకమైన తీర్పునిచ్చిన ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. యూడీఎఫ్‌పై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్‌కు ప్రజలు పట్టం కట్టనున్నారనడానికి తాజా ప్రజా తీర్పు స్పష్టమైన సంకేతాలిచ్చిందని అన్నారు.


ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్

ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్

Updated Date - Dec 13 , 2025 | 09:53 PM