Thiruvananthapuram: తిరువనంతపురం కొర్పొరేషన్ బీజేపీ కైవసం
ABN , Publish Date - Dec 13 , 2025 | 02:57 PM
తిరువనంతపురంలో ఇంతకుముందు 2020లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగగా, ఎల్‌డీఎఫ్ 52 వార్డులు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 33 వార్డులు, యూడీఎఫ్ 10 వార్డులు దక్కించుకున్నాయి.
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటక్ ఫ్రెంట్ (LDF), కాంగ్రెస్ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)కు గట్టి దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ (BJP) సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) విజయకేతనం ఎగురవేసింది. 101 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 50 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. ఎల్‌డీఎఫ్ 29 వార్డుల్లో గెలుపు సాధించగా, 19 వార్డులను యూడీఎఫ్ సొంతం చేసుకుంది. రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు.
తిరువనంతపురంలో ఇంతకుముందు 2020లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగగా, ఎల్‌డీఎఫ్ 52 వార్డులు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 33 వార్డులు, యూడీఎఫ్ 10 వార్డులు దక్కించుకున్నాయి.
కాగా, వచ్చే ఏడాది కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా తాజాగా జరిగిన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 45 ఏళ్ల తర్వాత కామ్రేడ్ల కోటలో బీజేపీ పాగా వేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి..
లియోనల్ మెస్సికి సారీ చెప్పిన సీఎం మమతా బెనర్జీ
ఆపరేషన్ సిందూర్.. అలర్ట్‌గా ఉండాలి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి