Mamata Banerjee Apologise: లియోనల్ మెస్సికి సారీ చెప్పిన సీఎం మమతా బెనర్జీ
ABN , Publish Date - Dec 13 , 2025 | 01:57 PM
శనివారం ఉదయం మెస్సి సాల్ట్ లేక్ స్టేడియానికి వెళ్లారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయనను చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు.
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు ఆయన ఇండియాలో పర్యటించనున్నారు. శనివారం కోల్‌కతాతో పాటు హైదరాబాద్‌లో ఆయన పర్యటించనున్నారు. ఈ ఉదయం కోల్‌కతాలో ఏర్పాటు చేసిన తన విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. అనంతరం సాల్ట్ లేక్ స్టేడియానికి ఆయన వెళ్లారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆయన అక్కడ ఉన్నారు. ఆ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయనను చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మ్యాచ్ ఆడతానని చెప్పి ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేడియంలో కుర్చీలు విరగ్గగొట్టారు. విరగ్గొట్టిన కుర్చీలను సాల్ట్ లేక్ స్టేడియంలోని ట్రాక్‌పై పడేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మెస్సికి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వాహణ లోపం గురించి తెలిసి షాక్‌కు గురయ్యాను. బాధ కూడా వేసింది. నేను స్టేడియానికి వస్తూ ఉన్నాను. లియోనల్ మెస్సి, స్పోర్ట్స్ లవర్స్, మెస్సి ఫ్యాన్స్‌కు క్షమాపణ చెబుతున్నాను.
ఈ సంఘటనపై నేను ఎంక్వైరీ కమిటీ వేస్తున్నాను. కమిటీ ఈ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాము. మరో సారి స్పోర్ట్స్ లవర్స్‌కు నా హృదయ పూర్వక క్షమాపణలు చేబుతున్నాను’ అని ఆమె అన్నారు. కాగా, మరికాసేపట్లో మెస్సి హైదరాబాద్ బయలుదేరుతారు. రాత్రి ఏడు గంటల సమయంలో ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మెస్సితో ఫుల్‌బాల్ ఆడనున్నారు.
ఇవి కూడా చదవండి
బంగారు ఆభరణాల్లో లక్క.. తూకం ఎక్కువగా చూపించి..
రోజాపై టీడీపీ నగరి నేతల ఫైర్...