Tungabhadra Dam: తుంగభద్రకు భారీగా ఇన్‌ఫ్లో.. ఏ క్షణమైనా..
ABN , Publish Date - Oct 24 , 2025 | 01:44 PM
ఉభయ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యాంకు వరద పొటెత్తుతోంది. ఇన్‌ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో డ్యాం గేట్లు తెరిచి నీరు వదలాలని అధికారులు భావిస్తున్నారు. ఏక్షణమైనా గేట్లు తెరచి నీరు వదిలే అవకాశం ఉంది.
- భారీ వర్షాలతో తుంగభద్రకు జలకళ
- జలాశయానికి భారీగా చేరుతున్న వరద
- 80 టీఎంసీలు దాటడంతో నీటి విడుదల యోచన
- దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు
బళ్లారి(బెంగళూరు): ఉభయ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యాం(Tungabhadra Dam)కు వరద పొటెత్తుతోంది. ఇన్‌ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో డ్యాం గేట్లు తెరిచి నీరు వదలాలని అధికారులు భావిస్తున్నారు. ఏక్షణమైనా గేట్లు తెరచి నీరు వదిలే అవకాశం ఉంది. డ్యాం కింది బాగం, నదీ పరీవాహక ప్రాంతాల గ్రామాలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని గురువారం తుంగభద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తుంగభద్ర డ్యాం(Tungabhadra Dam) నీటి నిల్వ సామర్థం 105.788 టీఎంసీలు, అయితే క్రస్ట్ గేట్ల పరిస్థితి నేపథ్యంలో డ్యాంలో నీరు 80 టీఎంసీల మాత్రమే నిల్వ చేయాలని సేఫ్టీ నిపుణుల కమిటీ సూచించిన సంగతి తెలిసిందే. నీటి నిల్వ 80 టీఎంసీలకు చేరడంతో నీరు వదలాలని అధికారులు భావిస్తున్నారు. గురువారం సాయంత్రం బోర్డు అధికారుల నీటి లెక్కల కొలతప్రకారం 21,697 క్యూసెక్కులకు చేరుకుంది.

భద్ర, తుంగ డ్యాం నుంచి అలాగే వరద రివర్ నుండి నీరు డ్యాంకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి కానీ శుక్రవారం ఉదయం నీరు విడుదల చేస్తామని బోర్డు అధికారులు పేర్కొన్నారు. నది ఇక వానీవిలాస్ డ్యాం కూడా పొంగి పొర్లుతోంది. డ్యాం బ్యాక్ వాటర్ వైపు ఉండే గ్రామాల్లోకి ఇప్పటికే నీరు చేరింది. ఇప్పటికే డ్యాం ఈ ఏడాదిలో రెండు సార్లు నిండింది. పలు గ్రామాల ప్రజలు ఇప్పటికే జలదిగ్భందంలో ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం
విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం
Read Latest Telangana News and National News