Share News

Minister Piyush Goyal: నేడు లోక్‌సభ ముందుకు జన్ విశ్వాస్ బిల్లు..

ABN , Publish Date - Aug 18 , 2025 | 09:34 AM

మన దేశంలో చిన్న విషయాలకు జైలు శిక్ష విధించే చట్టాలు ఉన్నా.. వాటిని ఎవరూ ఎప్పుడూ పట్టించుకోలేదని పియూష్ గోయల్ తెలిపారు. భారతీయులను జైలులో పెట్టే అటువంటి అనవసరమైన చట్టాలను రద్దు చేసే బాధ్యతను తాను స్వయంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Minister Piyush Goyal: నేడు లోక్‌సభ ముందుకు జన్ విశ్వాస్ బిల్లు..
Piyush Goyal

ఢిల్లీ: లోక్‌సభలో మరో కీలక బిల్లు ప్రవేశపెట్టాడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది. వ్యాపార, జీవన విధానాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఇవాళ(సోమవారం) లోక్‌సభలో జన్ విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు, 2025ను ప్రవేశపెట్టనుంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఈ బిల్లును ప్రవేశపెడతారు. ఇది నేరాలను నేరరహితం చేయడానికి, ఏదైనా పనిని లేదా ఆలోచనను సమర్థించడానికి అనేక చట్టాలను సవరించడానికి ఉపాయోగపడుతుంది. బిల్లు ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. 2023లో మొదటి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత జన్ విశ్వాస్ చట్టం కింద ఇది రెండవ ప్రధాన బిల్లు అని చెప్పుకొచ్చారు.


మన దేశంలో చిన్న విషయాలకు జైలు శిక్ష విధించే చట్టాలు ఉన్నా.. వాటిని ఎవరూ.. ఎప్పుడూ పట్టించుకోలేదని పియూష్ గోయల్ తెలిపారు. భారతీయులను జైలులో పెట్టే అటువంటి అనవసరమైన చట్టాలను రద్దు చేసే బాధ్యతను తాను స్వయంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ బిల్లుతో దాదాపు 300 చిన్న నేరాలను నేరరహితంగా పరిగణించనున్నారు. అయితే మొదటి నేరాలకు ఎటువంటి జరిమానాలు ఉండవుని స్పష్టం చేశారు. బదులుగా మొదటి నేరాలకు నోటీసులు జారీ చేస్తారని వివరించారు. రెండవ నేరం నుండి జరిమానాలు వర్తిస్తాయి తెలిపారు. 2023 వెర్షన్‌లో, జాన్ విశ్వాస్ చట్టం 42 చట్టాలలోని 183 నిబంధనలలో సవరణల ద్వారా చిన్న నేరాలను నేరరహితంగా చేసిందని చెప్పుకొచ్చారు.


అయితే బిల్లు ఎజెండా ప్రకారం.. ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత, బిల్లును మరింత పరిశీలన కోసం లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి కూడా సూచించవచ్చని పియూష్ గోయల్ చెప్పుకొచ్చారు. తదుపరి సెషన్ మొదటి రోజు నాటికి కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని స్పష్టం చేవారు. వ్యక్తులు, వ్యాపారాలు, సమాజంపై ఉన్న నియమాలు, శిక్షలు, భారం తగ్గించడం, పాత శిక్షా నిబంధనలను రద్దు చేయడం, సులభమైన, ప్రభావవంతమైన నియంత్రణ వాతావరణాన్ని సృష్టించడం ఈ బిల్లు ముఖ్య లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడానికి 2047 నాటికి విక్సిత్ భారత్ కోసం ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా చేయడానికి ఈ బిల్లు కీలకమని అభివర్ణించారు. జన్ విశ్వాస్ బిల్లుతో పాటు, ప్రభుత్వం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు, 2025ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు పియూష్ గోయల్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

డ్రమ్ములో పురుషుడి కుళ్లిన శవం.. ఫ్యామిలీ మిస్సింగ్..

చివరి నిమిషంలో విమానం రద్దు.. కారణం ఏంటంటే..

Updated Date - Aug 18 , 2025 | 09:34 AM